రైతుల మరణయాతన, నేతల ప్రేలాపన

3 Aug, 2016 00:52 IST|Sakshi
రైతుల మరణయాతన, నేతల ప్రేలాపన

విశ్లేషణ
 
సగటున ఏటా 17వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏటా 100 మంది సైనికులు చనిపోతే రక్షణమంత్రి స్పందించినట్టు, ఏటా 17వేల మంది రైతులు చనిపోతున్నా వ్యవసాయ మంత్రిత్వశాఖ స్పందించడంలేదు.

 
 
గడచిన మూడేళ్లలో ఆత్మ హత్యలు చేసుకున్న 418 మంది రైతులు ‘దెయ్యం పట్టి నవాళ్లే’ అంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రి భూపేంద్ర సింగ్ ఒక లిఖిత పూర్వక సమా ధానంలో చెప్పారు.  ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆ మంత్రివర్యుడు సకల మర్యాదలను అతిక్రమించారు. ఈ ప్రకటనకు బీజేపీ సీనియర్ నాయకుడు బాబూలాల్ గౌర్ వంటి వారు కూడా నవ్వుకున్నారు. అంతేకాదు, వినోద శాఖ ఏర్పాటు చేయడానికి ఇది ప్రాథమిక ఆలోచనేమోనని కూడా ఎద్దేవా చేశారు. ఏమైనా గానీ, రైతులు ఆత్మహత్యలంటే రాజకీయ నాయకులు ఎంత చులకనగా చూస్తున్నారో బాధ్యతా రాహిత్యంతో కూడిన ఈ ప్రకటనే చెబుతోంది. ఇలాంటి ప్రకటనలు ప్రధా నంగా పలుచోట్ల అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల నోటి నుంచి వెలువడుతూ ఉండటమే విషాదం. గడచిన రెండు దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో 3,15,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే అది కరాళ నృత్యం కంటే తక్కువేమీ కాదు. నిజానికి ఈ ఆత్మహ త్యలు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న దారుణ పరి స్థితి మీద  రైతులు ఆగ్రహంతో చేస్తున్న వ్యక్తీకరణలు. అయితే వారు కోరుకున్నట్టు దేశాన్ని ఒక సమష్టి చైతన్యంతో కదలించడం దగ్గర విఫలమవుతున్నారు.

మహారాష్ట్ర నుంచి పార్లమెంటుకు ఎన్నికైన బీజేపీ సభ్యుడు సంజయ్ ధోత్రే చేసిన ప్రకటన కూడా గుర్తు చేస్తాను. ‘రైతులని వాళ్ల మానాన వాళ్లని వదిలిపెట్టండి. పంటలు పాడైతే ఏం చేయాలో వాళ్లకి తెలుసు. వాళ్లు చనిపోతే, పోనివ్వండి. ఎవరికి శక్తి ఉందో వారే పండి స్తారు. మిగిలిన వాళ్లు పండించరు.’ అన్నారాయన. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా జుగుప్సాకరమైన ప్రకటన చేశారు. నీటి పారుదల సౌకర్యాలు లేక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారని చెబితే ఆయన అన్నమాట ఇదీ: ఢిల్లీలో ఉన్న భవంతి ఆవరణలో మొక్కలు ఉన్నాయని వాటికి మూత్రం పోస్తున్నానని అన్నారా యన. నాకు అర్థం కాక అడుగుతున్నాను, కేంద్ర మంత్రి వర్యుల ఉద్దేశం రైతులంతా పొద్దుగూకులు పొలంలోనే ఉండి, తాము వేసిన గోధుమ లేకుంటే చెరకు పంటలకు మూత్ర విసర్జన చేస్తూ ఉండాలనా? నిజానికి గడ్కరీ ప్రకటన చూస్తే, ఆయన మౌలిక వాస్తవాల నుంచి ఎంత దూరంగా జరిగారో అర్థమవుతుంది.
 
సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ కూడా ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటన ఇచ్చి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ప్రేమలో విఫలం చెందడం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారని ఆయన భాష్యం చెప్పారు. సరే, అదేనని ఒప్పుకుందాం. రైతులు కూడా మానవమాత్రులే. వాళ్లను కూడా భగ్నప్రేమ బాధిస్తుంది. విఫల వివా హాలు వేధిస్తాయి. అతడూ మనిషే కాబట్టి తన జీవిత భాగస్వామి ఎవరితో అయినా లేచిపోతే క్షోభ పడతాడు. అయితే చాలా సందర్భాలలో సామాజిక, వ్యక్తిగత కార ణాలు రైతును ఆత్మహత్యకు పురిగొల్పుతున్నాయి. కానీ ఈ మహా విషాదాన్ని కేవలం వ్యవసాయ సంక్షోభాన్ని ప్రతిబింబించే విషాదంగా చిత్రించడమే దారుణం. ఈ విశాల దేశంలో ఏదో ఒక మూల ప్రతి రెండు గంటలకు ఒక రైతు బలవన్మరణం పొందుతున్నాడు.

ఇంతకు మించిన విషాదం ఏముంటుంది? ఇంతటి పెను ఉత్పా తాన్ని ఏదో ఒకవైపు నుంచి నిరోధించే కనీస ప్రయత్నం కూడా జరగడం లేదు. మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి అయితే, రైతుల బలవన్మరణాలకి తన వద్ద  పరిష్కారం లేదని తేల్చేశారు. అయితే సైనికులు ఆత్మహత్యలు చేసు కుంటున్నారంటూ వచ్చిన వార్త వినగానే మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించిన తీరును నేను హర్షి స్తాను. ప్రమాదకర స్థాయికి చేరుకున్న సైనికుల ఆత్మహ త్యల నివారణకు ఆయన ఆలస్యం చేయకుండా ఒక మేధోమథన సమావేశం నిర్వహించారు. దీనికిత్రివిధ దళాధిప తులు, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రక్షణ సిబ్బంది మానసిక వ్యాధుల నిరోధక పరిశోధనా సంస్థ అధిపతి హాజరయ్యారు. 2012 ప్రాంతంలో జరిగిన ఈ సమా వేశం ఉద్దేశం సైనికుల ఆత్మహత్యల ధోరణిని నిలు వరించడానికి ఏం చేయాలో యోచించడమే.

2003-2012 మధ్య దాదాపు 1,000 మంది సైనికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే 1995- 2011 మధ్య 2,90,470 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వివరాలు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి హరీశ్ రావత్ పార్లమెంటుకు ఇచ్చినవే. అంటే సగటున ఏటా 17,000 మంది రైతులు బలవన్మ రణాల వైపు మొగ్గుతున్నారు. ఏటా 100 మంది సైని కులు చనిపోతే రక్షణమంత్రి స్పందించిన స్థాయిలో, ఏటా 17,000 మంది రైతులు చనిపోతున్నప్పటికి, దీనికి వ్యవసాయ మంత్రిత్వశాఖ స్పందించడంలో విఫలమ యింది. వాస్తవం ఏమిటంటే రైతుల ఆత్మహత్యలు దారుణంగా కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎవరికీ పట్టడం లేదు.
    

(వ్యాసకర్త : దేవీందర్ శర్మ, వ్యవసాయరంగ నిపుణులు hunger55@gmail.com)
 

మరిన్ని వార్తలు