బహ్రెయిన్‌లో జయశంకర్ సార్ జయంతి వేడుకలు

5 Aug, 2017 17:54 IST|Sakshi



తెలంగాణా జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి 83వ జయంతి వేడుకలను బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నేతలు జయశంకర్ సారుకు నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని అనంతరం ఆండాల్స్ గార్డెన్ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మూడో విడత హరితహారం తెలంగాణకు మణిహారంగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో దీనిని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు బహ్రెయిన్‌లో హరితహారం చేపట్టారు.

బహ్రెయిన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ మహోన్నతమైన వ్యక్తి అని సార్ సేవలను కొనియాడారు. ప్రతీ సామాజిక అంశంపై సార్ పరిశీలన చాలా గొప్పగా ఉండేదని.. ఆయన చేసిన భావజాల వ్యాప్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. జయశంకర్ సార్ పిలుపుతో ఊరూరా కేసీఆర్‌ లాంటి నేతలు తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేసుకున్నారు. సార్ జయంతి వేడుకలను గల్ఫ్ దేశాల్లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీ లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు సుమన్ అన్నారం, రవిపటేల్ దెశెట్టి, జాయింట్ సెక్రెటరీలు సంజీవ్ బురమ్, విజయ్ ఉండింటి, ప్రమోద్ బోలిశెట్టి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు