రెండు శ్రీలూ రెండు సాహిత్య ప్రతీకలు

15 Jun, 2016 00:36 IST|Sakshi
రెండు శ్రీలూ రెండు సాహిత్య ప్రతీకలు

మరో ప్రపంచం తాత్విక కవి శ్రీశ్రీ. మార్క్సిస్టు దృక్పథానికి సాహిత్య అన్వయ ద్రష్ట - శ్రీశ్రీ. శ్రామిక వర్గ ప్రజా కవి - శ్రీశ్రీ.  శ్రీశ్రీలో రెండుగా శ్రీలూ - రెండు చీలి పోయిన వర్గ సమాజానికి సాహిత్య ప్రతీకలు. ‘ఈ శతాబ్దం నాది’ అని ఎలు గెత్తి చాటి చెప్పిన శ్రీశ్రీ కలంలో ఈనాటి వర్త మాన సామాజిక సంఘర్షణలోని ఆక్రోశం కూడా ప్రతిధ్వని స్తుంది. ‘ఈ శతాబ్దం నాది’ అని శ్రీశ్రీ అన్నది వ్యక్తి గతం కాదు. తాను ఏ శ్రామిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రజలది అని ఉద్దేశం.


మంటల చేత మాట్లాడించి, కన్నీళ్ల చేత కవాతు చేయించి చెమటా నెత్తురులను రాపిడి పెట్టి -అగ్ని కిరీటపు ధగధగలతో ఎర్రబావుటా నిగనిగల్ని తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎగరేసిన చైతన్యాగ్ని శిఖ శ్రీశ్రీ. ‘అరసం’ కానివ్వండి, ‘విరసం’ కాని వ్వండి. -శ్రీశ్రీ ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణంతో మమేకమైనవాడే. ఉద్యమాలతో నిరంతరం మమేక మయ్యే సమష్టి వ్యక్తిత్వం - శ్రీశ్రీ.

ఉత్పత్తి విధానాన్ని సామాజీకరించిన పెట్టుబడి దారీ వ్యవస్థకీ, ఉత్పత్తి సాధనాల్ని ప్రజలపరం చేయాలనే సామ్యవాద వ్యవస్థకీ మధ్య సంఘర్షణ గుణాత్మకంగా పరిష్కారం అయ్యేంతవరకూ శ్రీశ్రీ కవిత్వం ప్రాసంగికతని కల్గే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘‘సామ్రాజ్యవాద ప్రపంచీక రణ’’ ఆర్థిక, సాంస్కృతిక విధానానికీ, శ్రీశ్రీ ‘‘మరో ప్రపంచ’’ దృక్పథమే కచ్చితమైన, శాస్త్రీయమైన, గతితార్కికమైన, చారిత్రకమైన ప్రత్యామ్నాయం.

 ఈ వాస్తవాన్ని అవగాహన చేసుకున్నది, పసి గట్టినదీ బలంగా సామ్రాజ్యవాద మేధావులే! కాబట్టే -‘అనాథలంతా, అశాంతులంతా, అనేకు లింకా దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో విప్లవ శంఖం పూరి స్తారోయ్’ అన్న హెచ్చరిక వెనుక ప్రమాదాన్ని గ్రహించి శ్రామికవర్గ ఐక్యతని చీలికలు పీలికలుగా పోగులుపెట్టి తునకల సిద్ధాంతంతో ‘అత్యాధుని కతా’ వాదంగా సాహితీ, సాంస్కృతిక రంగాలలో ప్రవేశపెట్టి - వైరుధ్యాల సంక్లిష్టతని గందరగోళం స్థాయికి చేరుస్తోంది సాంస్కృతిక సామ్రాజ్యవాదం. శ్రీశ్రీ కవిత్వం విప్లవ భావజాలాన్ని ఎర్ర బావుటా నిగనిగల్తో తెలుగునేల మీద ఆవిష్కరిం చింది. చాలామంది విప్లవం, అభ్యుదయం వైరు ధ్యం ఉన్నట్లుగా రెండూ రెండు భిన్న అంశాలుగా భావిస్తుంటారు.

ఈ వర్గ సమాజం ఉన్నంతకాలం శ్రీశ్రీ కవిత్వం బతికే ఉంటుంది. శ్రీశ్రీ కవిత్వం బతికున్నంతకాలం శ్రీశ్రీ బతికే ఉంటాడు. శ్రీశ్రీ బతి కున్నంతకాలం మరో ప్రపంచం ఆశయం బతికే ఉంటుంది. మరో ప్రపంచం ఆశయం బతికున్నంత కాలం సాహిత్య సాంస్కృతిక రంగాలలో గుణాత్మక మార్పులకేసి పరిమాణాత్మక మార్పులు ప్రవహిస్తూనే ఉంటాయి. పరిమాణాత్మక మార్పులు గుణాత్మక మార్పు వైపు పోగుపడకుండా ప్రతి మలుపులోనూ శ్రీశ్రీపై, అతని కవిత్వంపై ఈనాటికీ జరుగుతున్న దాడులు నిజానికి శ్రీశ్రీ మీద కాదు శ్రీశ్రీ... ఏ మరో ప్రపంచ తాత్వికతని ఏ అశాంతుల, అనాథల, అనేకుల (బహుజనాలలో) ఏ పీడితుల (దళితులు) పక్షం వహించి గొంతెత్తి, కలమెత్తి ప్రాతినిధ్యం వహించాడో ఆ శ్రామిక వర్గ దృక్పథం మీద దాడులవి. కుటుంబరావుగారు శ్రీశ్రీ గురించి ఇలా అంటారు ‘‘నిజమే - శ్రీశ్రీని దాటి తెలుగు సాహి త్యం చాలా దూరమే వచ్చేసింది. కానీ శ్రీశ్రీ అంత ఎత్తుకి ఇంకా ఎదగలేదు.’ దీనిని సమీక్షిం చుకోవాలి.

 మాట్లాడ్డం మాట్లాడ్డం కోసం కాదు. వినడం వినడం కోసం కాదు. రాయడం రాయడం కోసం కాదు. చదవడం చదవడం కోసం కాదు. సాహిత్యం సాహిత్యం కోసం కాదు. భావజాల రంగంలో సంఘర్షణ భౌతిక శక్తిగా మారి నూతన ప్రజాతంత్ర విప్ల వాన్ని పూర్తి చేసుకోవలసిన కూడలిలో ఉన్నాం. అక్షరాలుగా మిగిలిపోకుండా, పదాలుగా కూడబలు క్కొని వాక్యాలుగా కవాతు చేద్దాం! సూర్యరశ్మి అం తటి వేడీ వెలుతురూ ఉన్న రసాత్మక కావ్యాన్ని ఆచ రణాత్మకంగా ఆవిష్కరిద్దాం! పదండి ముందుకు..!

- పీఎస్ నాగరాజు
వ్యాసకర్త ప్రజాసాహితి సంపాదకుడు
మొబైల్ : 94419 13829

(నేడు శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా)

 

మరిన్ని వార్తలు