అందరూ నిశానీదారులే!

11 Feb, 2017 00:43 IST|Sakshi
అందరూ నిశానీదారులే!

అక్షర తూణీరం
మనిషిని సృష్టించినవాడు దేవుడే అయితే, ఆయన నిజంగా గొప్పవాడు. మనిషిలో ఏ చిన్న పార్ట్‌నీ డూప్లికేట్‌ చేసే అవకాశం లేకుండా డిజైన్‌ చేశాడు. వేళ్ల కొసల్లో శంఖుచక్రాలు అమర్చాడు. దాన్నొక శాస్త్రంగా చేసుకుని బతకడానికి కొందరికి అవకాశం కల్పించాడు.

ప్రస్తుతం దేశం వేలిముద్రల మీద నడు స్తోంది. ఒక ప్పుడు నిరక్షరా శ్యుణ్ని వేలి ముద్రగాడు, నిశాని పద్దు అని పిలిచేవారు. ఇప్పుడు వేలిముద్ర లేకుండా తెల్లారదు, పొద్దుగూకదు. ఎన్ని కోట్ల మంది జనం ఉన్నా, ఏ ఇద్దరి ఫింగర్‌ ప్రింట్సూ ఒక్కలాగా ఉండవని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మనిషి ఎన్నడో కనిపెట్టాడు. చేవ్రాలుని ఎవరైనా ఫోర్జరీ చెయ్యచ్చుగాని వేలిముద్రని చేయడం బ్రహ్మతరం కూడా కాదు. అందుకని ముఖ్యమైన పత్రాల మీద సంతకందార్లయినా, వేలిముద్రలు వేసి తీరాల్సిందే. క్రయవిక్రయ దస్తావేజుల మీద, పాస్‌పోర్ట్‌ వ్యవహారంలో వేళ్లకు సిరా రాసుకోక తప్పదు. పూర్వం ప్రొ నోటు మీద మగవారైతే ఎడమ చేతి బొటనవేలుని, ఆడవారైతే కుడిచేతి బొట నవేలుని తిప్పి తీరాల్సిందే. ఇప్పుడు అదే ఆచారం అందర్నీ శాసిస్తోంది. వేలి ముద్రకున్న నిజాయితీ సంతకానికి లేకుండా పోయింది.

పనిచేసేచోట్లలో బయోమెట్రిక్‌ విధానం వచ్చి చాలా కాలమైంది. సొంత వేలైతే తప్ప వేళలు అతిక్రమించే పప్పు లుడకవ్‌. అసలెందుకు, సమస్త క్రిమినల్‌ వ్యవహారాల్ని పట్టిచ్చేది ఫింగర్‌ ప్రింట్సే. అదొక పెద్ద శాస్త్రం. ఆధార్‌ కార్డ్‌కి మూలాధారం వేలిముద్రే. సెల్‌ఫోన్‌ని, ఐపాడ్‌ని, టాబ్లెట్‌ని వేలిముద్రతోనే లాక్‌ మరియు అన్‌లాక్‌ చేసుకుంటారు. లాక ర్స్‌కి కూడా ఇలాంటి ‘నిశాని తాళం’ సదుపాయం ఉంది. అసలీ బయోమె ట్రిక్‌ విధానంతో దొంగ ఓట్లని నిరోధిం చవచ్చు.
వేళ్లన్నీ గొప్పవేగానీ బొటనవేలు మరింత గొప్పది. పురుషసూక్తంలో బొట నవేలు ఒక కొలమానంగా ప్రస్తావనకు వస్తుంది. ‘అంగుష్టమాత్రం’ అనే వాడుక అక్కడనించే వచ్చింది. రాజగురువు ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ని కుడిచేతి బొటనవేలుని గురుదక్షిణగా కోరి స్వీక రించాడు. శిష్యుణ్ని ఆ విధంగా అశక్తుణ్ని చేసి పుణ్యం కట్టుకున్నాడు. ఇది వేరే కథ. ఇప్పుడీ నగదు రహిత లావాదేవీలు వచ్చాక, చేవ్రాలు మరీ అపురూపమై పోయింది. ఇక్కడో విషయం చెప్పాలి. పెద్ద వాళ్లంతా పదే పదే న.ర. లావా దేవీలంటున్నారు. న.ర. ఆర్థిక లావా దేవీలు అనకపోతే కొంచెం అపార్థం ధ్వనిస్తోంది.

ఆ విషయం అలా ఉంచితే, ప్రస్తుతం బ్యాంకి చెక్కుల మీద కూడా వేలిముద్ర ప్రవేశపెడితే బెటరనిపి స్తోంది. కార్డ్‌ స్వైపింగ్‌ వచ్చాక చీటికీ మాటికీ సంతకాలు పెట్టే పని తగ్గింది. దాంతో సంతకం టాలీ కాలేదని చెక్కులు తిరిగి రావడం, దాంతో అపార్థాలు ఎక్కు వైనాయి. అదే నిశాని అయితే పేచీపూచీ ఉండదు.

మనిషిని సృష్టించినవాడు దేవుడే అయితే, ఆయన నిజంగా గొప్పవాడు. మనిషిలో ఏ చిన్న పార్ట్‌నీ డూప్లికేట్‌ చేసే అవకాశం లేకుండా డిజైన్‌ చేశాడు. వేళ్ల కొసల్లో శంఖుచక్రాలు అమర్చాడు. దాన్నొక శాస్త్రంగా చేసుకుని బతకడానికి కొందరికి అవకాశం కల్పించాడు. వేలి కొసలే కలవనప్పుడు రెండు మెదళ్లు ఎలా కలుస్తాయ్‌? అందుకే ట్రంప్‌ బ్రెయి న్‌లా మరో బ్రెయిన్‌ ఉండదు. ఇది వేలి ముద్రంత నిజం.

- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు