అట్లాంటాలో ఘనంగా 'తామా' ఉగాది సంబరాలు

26 Apr, 2017 11:45 IST|Sakshi
అట్లాంటాలో ఘనంగా 'తామా' ఉగాది సంబరాలు

అట్లాంటా:
తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(తామా) ఆధ్వర్యంలో లాంబెర్ట్ స్కూల్లో నిర్వహించిన ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి అట్లాంటా నుంచి భారీగా ప్రవాసాంధ్రులు తరలివచ్చారు. మొదటగా 'తామా' 'అమృత వర్షిణి' ఆధ్వర్యంలో జరిగిన సాహితీ సదస్సు కార్యక్రమంలో పలువురు పిల్లలు, పెద్దలు పాల్గొని కథలు, స్వీయ రచనలు ప్రదర్శించారు. తామా సంస్కృతిక కార్యదర్శి ప్రియా బలుసు స్వాగతోపన్యాసంతో సభను ప్రారంభించారు. యాంకర్ మధు 'తామా' కార్యవర్గ సభ్యులని, బోర్డు సభ్యులని వేదిక మీదకు ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన చేయమని కోరారు. తర్వాత మధు, గాయని సుమంగళి , గాయకుడు ధనంజయ్ని ఆహ్వానించి సభకి పరిచయం చేసి సంస్కృతిక కార్యక్రమాలని ఘనంగా ప్రారంభించారు.

నగరములో ప్రముఖ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, నాటకాలు, పాటలు, ఆలపించిన శ్లోకాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శ్రీవల్లి శ్రీధర్ దర్శకత్వం వహించిన 'తామా' వారి పెళ్లి సందడి నాటకం అతిథులని ఆనంద పరవశంలో ముంచాయి. దాదాపు మూడు వందల మంది కళాకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

తామా కార్యవర్గ సభ్యులు, బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో  ప్రెసిడెంట్  హర్ష యెర్నేని ఉగాది వేడుక దాతలు మాగ్నమ్ ఓపస్ ఐటి సాగర్ లగ్గిశెట్టి, జీవీఆర్ రియాల్టీ విజయ్ గార్లపాటిని సత్కరించారు. 'తామా' ఉచిత ఆసుపత్రిలో అందించిన సేవలకుగానూ డాక్టర్ శ్రీహరి మాలెంపాటి, డాక్టర్ చైతన్య సూర్యదేవర, డాక్టర్ ఆనంద చుండూరిలను సత్కరించారు.


పండితులు ఫణికుమార్ ఉగాది పంచాంగ శ్రవణం సభలోని వారందరూ శ్రద్ధగా ఆలకించారు. తమ తమ రాశిఫలాల వివరాలను ఎంతో ఆసక్తిగా విన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన శ్రీనివాస్ నిమ్మగడ్డ, శ్రీనివాస్ రాయపురెడ్డి, అనిల్ యలమంచలి, సురేష్ ధూళిపూడి, విజయ్ బాబు, అంజయ్య చౌదరి, భరత్ అవిర్నేని, శ్రీనివాస్ లావు, ఉపేంద్ర నర్రా, వెంకట్ అడుసుమల్లి, వినై కొత్తపల్లి, రాజేష్ జంపాల, మల్లిక్ మేదరమెట్ల, సునీల్, వెంకట్ పొలకం, ప్రసాద్ కుందేరు, జగదీష్ ఉప్పల, శ్రీనివాస్ ఉప్పు, ప్రశాంత్ పొద్దుటూరి, రమేష్ వెన్నెలకంటి, అరవింద్ మిర్యాల, మాధవ్ మట్ట, రాజ్ చింతగుంట, కరుణాకర్ బోయినపల్లి, అరుణ్ బొజ్జ, రవి కల్లి, శ్రీనివాస్ గుంటాక, రాకేష్ కున్నాత్, శివ రామ రాజు వేగేశ్న, విష్ణు వైదన, అవినాష్ గోగినేని, రమేష్ కొటికే, మాధవి అల్లాడి, రామ్ మద్ది, విజయ్ రావిళ్ల, బాల నారాయణ మద్ద, మురళి కిలారు, శ్రీనివాస్ విప్పు, రమేష్ వెన్నెలకంటి, సతీష్ బచ్చు, గణేష్ కస్సం, గిరి సూర్యదేవర, హరికృష్ణ ఎల్లప్రోలు, ఆదిత్య పాలమాకుల, శ్రావ్య శ్రీ ఎగలపాటి, పెదబాబు తుర్లపాటి, శివ సబ్బి, నవీన్ పావులూరి, ప్రశాంత్ వీరబొమ్మ, ప్రభాకర్ కొప్పులు, రాహుల్ తోటకూర, రమేష్ యెర్నేని, రుపేంద్ర వేములపల్లి, శ్రీనివాస్ యెర్నేని, శరత్ వేమరాజు, సునీల్ ఎడపగంటి, సురేష్ గాడిరాజు, కిషోర్ దేవరపల్లి, శ్రీధర్ దొడ్డపనేని, శ్రీ హర్ష పులి, శ్రీనివాస్ రెడ్డి కొండా, లోకేష్ బోడేపూడి, రాజేష్ ఆలాగుండుల, రాజేష్ కొమ్మిశెట్టి, రమేష్ సాగర్ కొటికే, భాస్కర్ పిల్లి, రాజేష్ చెప్పప్రాపు, ప్రవీణ్ పురమ్, రామ్ మద్ది, అరవింద్ మిర్యాల, శ్రీకాంత్ కరి, బాలనారాయణ మద్ద, రమేష్ మెడాలకి 'తామా' కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తామా ప్రెసిడెంట్ హర్ష యెర్నేని, తామా సాహితి కార్యదర్శి హేమంత్ వర్మ పెన్మెత్స,  కిరణ్ మంచికంటి, వెంకట్ చెన్నుబొట్ల, సుబ్బు భాగవతిలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

'తామా'ఉపాధ్యక్షుడు మనోజ్ తాటికొండ ఉగాది ఉత్సవాలకు విచ్చేసిన ప్రేక్షకులకి, సహాయ సహకారాలు అందించిన వాలంటీర్స్, స్పాన్సర్స్, పర్సిస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసి జాతీయ గీతంతో ఉగాది కార్యక్రమాలని దిగ్విజయంగా ముగించారు.




మరిన్ని వార్తలు