మరపురాని మనీషి వైఎస్‌ఆర్

2 Sep, 2016 01:33 IST|Sakshi
మరపురాని మనీషి వైఎస్‌ఆర్

 సందర్భం

కాంతమ్మ నిశ్చేష్టురాలైంది. మూడేళ్ల పిల్ల ఉన్నట్టుండి కాళ్లూచేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. సమయానికి మొగుడూ లేడు. అర్ధరాత్రి. పొరుగూరుకు వెడితే కానీ డాక్టరు దొరకడు... రామనాథా నికి సర్కారు మీద కోపం వస్తోంది. కూతురు, అల్లుడు పండక్కి వచ్చారు. మనవడికి ఒళ్లు కాలిపోయే జ్వరం. ఊళ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నా, సేవలు అంతం తమాత్రమే. బస్తీకి టాక్సీ కారులో తీసుకువెళ్లి వైద్యం చేయించాల్సి వచ్చింది. కోపం రాకుండా ఎలా? జోగయ్యకు భరించలేని కడుపు నొప్పి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. అదృష్టం, డాక్టరు ఉన్నాడు. ఎక్స్‌రే తీయాలన్నారు. ఇంకో అదృష్టం ఎక్స్‌రే యంత్రం ఉంది. కానీ దురదృష్టం - టెక్నీషియన్ లేడు. అవసరమైన వైద్యం వెంటనే దొరకలేదు. ఏం చెయ్యాలి? మూర్తి, శైలజ హనీ మూన్‌కి వెళ్లి వస్తుంటే అడవిలాంటి చోట కారు ఆగిపోయింది. దానికితోడు వర్షం. ఓ చిన్న టీ పాక కనిపిస్తే వెళ్లారు. తాగిన టీ వికటించిందో ఏమో, మూర్తికి వాంతులు మొదల య్యారుు. కొత్త పెళ్లికూతురు విలపించడం మొదలు పెట్టింది. ఇలాంటి కాంతమ్మలు, రామనాథాలు, జోగ య్యలు, శైలజలు ఇంకా ఎందరో.. అందరిదీ ఒకటే ప్రశ్న- ‘ఏం చెయ్యాలి?’

స్వయంగా డాక్టరు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఈ ప్రశ్న వేసుకున్నారు. అధి కారులతో, వైద్య నిపుణులతో మాట్లాడారు. ఫలితంగా రూపు దిద్దుకున్నవే 108, 104, ఆరోగ్యశ్రీ. 104 నెంబ రుకు ఫోను చేయగానే ఆ కాల్ సెంటరు సిబ్బంది సదా అందుబాటులో ఉంటారు. తీవ్రతను బట్టి డాక్టరుతో మాట్లాడిస్తారు. లక్షణాలను బేరీజు వేసుకున్న వైద్యుడు సూచనలు చేస్తారు. అర్ధరాత్రి అపరాత్రి వైద్యుడిని సంప్రదించగల అవకాశం కల్పించడమే కాల్ సెంటరు ధ్యేయం. డాక్టర్ల, రోగ నిర్ధారణ పరికరాల లభ్యత; సదు పాయాల అందుబాటు, కరెంటు కోత వివరాలు వంటి విషయాలు అడిగిన వారికి తెలియచేస్తారు. దీనితో సమయం వృధా కాదు.

అటూ ఇటూ తిరిగే ప్రయాస ఉండదు. రోగి పరిస్థితి బాగా లేదనుకుంటే 104 కాల్ సెంటరు వాళ్లే 108కి తెలియచేస్తారు. నిమిషాల్లో అంబు లెన్సు వచ్చి రోగిని ఆసుపత్రికి చేరవేస్తుంది. అప్పటి నుంచి ఆరోగ్యశ్రీ ఆదుకుంటుంది. ఎంత ఖరీదైన వైద్యం అవసరమైనా, సంజీవనిలా అదే అందిస్తుంది. మరో పక్క, సంచార వాహనాలు నెల నెలా ఊళ్లకు వెళ్లి పరీ క్షలు చేసి, అవసరమైన  మందులు ఇస్తారుు. బీపీ, చక్కెర వంటి వ్యాధులు ప్రాణాంతకంగా పరిణమించ కుండా కట్టడి చేయడానికి వీలుపడుతుంది. ఇవన్నీ పూర్తిగా ఉచితం. కానీ వైఎస్ హయాంలో వచ్చిన ఈ పథకాలు కొన్ని పూర్తిగా, కొన్ని అరకొరగా అమలై నాయి. కొందరు స్వార్థపరుల మూలంగా కొన్ని అవక తవకలు చోటుచేసుకున్నారుు. ఈలోగా ఈ పథకాల రూపశిల్పి అంతర్ధానమయ్యారు. వైఎస్ అనుకున్నట్టు ఇవి రూపుదాల్చి ఉంటే వైద్య, ఆరోగ్య సేవలకు సంబం ధించి సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనం దక్కేది.

నాకు బాగా గుర్తు. అవి 2004లో మొదటిసారి వైఎస్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన రోజులు. కానీ చదువుకున్న కొందరిలో ఆయన పట్ల కొంత వైమన స్యభావం ఉండేది. మా బంధువర్గంలో ఒకాయనకు వైఎస్ అంటే గిట్టేది కాదు. బాగా  చదువుకున్నాడు, పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగి. ఊరికి దూరంగా పెద్ద ఇల్లే కట్టుకున్నాడు. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డా ఆయన మాత్రం భార్యతో ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆయనకే పెద్ద కష్టం వచ్చిపడింది. ఓ అర్ధరాత్రి భార్యకు గుండె పోటు వచ్చింది. ఇంట్లో కారుంది కాని, ఆ సమయంలో డ్రైవర్ లేడు. ఆటోలు దొరికే  ప్రాంతం కాదు. ఆ సమయంలో ఆయనకు, వైఎస్ బహిరంగసభల్లో ‘కుయ్ కుయ్’ అంటూ 108  అంబులెన్సు గురించి చెప్పే మాట గుర్తు కువచ్చి ఫోను చేశాడు. ఆ అర్ధరాత్రివేళ పదే నిమి షాల్లో అంబులెన్సు వచ్చి, ఈ నిమిషమో, మరు నిమిషమో అనే పరిస్థితిలో ఉన్న ఆయన భార్యను ఆసుపత్రికి చేర్చింది. సకాలంలో తీసుకువచ్చినందువల్ల ప్రాణాలు కాపాడగలిగామని డాక్టర్లు చెప్పడంతో వైఎస్ పట్ల ఆయన పెంచుకున్న అకారణ నిరసన భావం అదృ శ్యమై, ఆరాధనాభావం చోటుచేసుకుంది. నిజానికి ఇలాంటి వాళ్లు ఎందరో! అటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుని బయటపడ్డ జనాలు నిత్యం తలచుకునే ఆ మనిషి పోయి ఏడేళ్లయింది. అయినా నేటికీ ఎక్కడ 108 అంబు లెన్సు ‘కుయ్ కుయ్’ అంటూ వెడుతున్నా వెంటనే గుర్తుకు వచ్చేది వైఎస్సారే!

(నేడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి)

 

 

 

 

రచయిత:భండారు శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు  98491 30595

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా