పెద్ద నోట్ల రద్దు... విఫల చరిత్రే..!

1 Dec, 2016 00:52 IST|Sakshi
పెద్ద నోట్ల రద్దు... విఫల చరిత్రే..!

సందర్భం
ప్రధాని నరేంద్రమోదీ చేప ట్టిన నోట్ల రద్దు విధానాన్ని నాడు సోవియట్ యూనియన్‌లో జరిగిన రూబుల్స్ రద్దుతో పోల్చవచ్చు. 1991 జనవరి 22న ఆ దేశ కరెన్సీ లోని 50, 100 రూబుల్స్‌ను అధ్యక్షుడు గొర్బచేవ్ రద్దు చేశారు. 1961 నుంచి చలా మణిలో ఉన్న రూబుల్స్‌ని  మూడు దశాబ్దాల తరువాత సోవియట్ యూనియన్‌లో సంస్కరణల యుగం ప్రారంభమైన నేపథ్యంలో రద్దు చేశారు. దీంతో బ్యాంక్‌లలో ప్రైవేటు ఖాతాలన్నీ నిలిచిపోయాయి. ప్రతి చోటా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. 1991 జన వరి 23 నుంచి వివిధ బ్యాంకులలో వ్యక్తిగతంగా ప్రజలు 500 రూబుల్స్ మించి తీసుకోరాదని ఆంక్షలు విధిం చారు. డిపాజిట్‌లపై కూడా పరిమితి విధించారు.
 
ఈ రూబుల్స్‌ను రద్దు చేసిన మూడు రోజులలో కొత్తనోట్లన్నీ బ్యాంకులకు వచ్చి చేరాయి. జనవరి 23 నుంచి 25 వరకూ పాత నోట్లను రష్యా ప్రజలు మూడు రోజులలో మార్పిడి చేసుకున్నారు. నాడు ప్రతీ వ్యక్తికీ 1000 రూబుల్స్‌ను మార్చుకోవడానికి అనుమతించారు. ఈ మార్పిడి 1991 మార్చి 31 వరకూ మాత్రమే జరి గింది. వ్యక్తిగత సేవింగ్‌‌స అకౌంటులో రోజుకు 500 రూబుల్స్ వరకే అనుమతించారు. అదే సమయంలో నల్ల ధనం మార్పిడి, వస్తువుల క్రయ విక్రయాలు భారీగా జరిగాయి. 1980లలో పెరిస్త్రోయికా, గ్లాస్‌నాస్త్ వంటి సంస్కరణల తరువాత సోవియట్ యూనియన్‌లో ప్రైవేటు ఆస్తులను కూడబెట్టడంతో అవినీతి, నల్ల ధనం బాగా పెరిగాయి.

గొర్బచేవ్ తిరిగి ఆర్థిక సంస్క రణలకు తెరతీశారు. ఫలితమే రూబుల్స్ రద్దు.. పాత రూబుల్స్ అన్ని తిరిగి బ్యాంక్‌లకు వచ్చిన తరువాత రష్యా 1, 3, 5, 10, 200, 500, 1000 విలువతో కొత్త రూబుల్స్‌ను విడుదల చేసింది. మొత్తం 14 బిలియన్ల రూబుల్స్‌ను విడుదల చేశారు. 10.05 శాతం అత్యధి కంగా కరెన్సీని విడుదల చేయడం వల్ల పంపిణీలో అవ రోధాలు ఏర్పడలేదు. దీంతో సోవియట్ ప్రజలు అంతగా ఇబ్బందులను ఎదుర్కోలేదు.
 
ముఖ్య విషయం ఏమిటంటే, 1978లో భారత ప్రధాని మురార్జీ దేశాయ్ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు విధానాన్ని సోవియట్ ప్రభుత్వం 1991లో అనుకరిం చడం విశేషం. దీన్ని నాటి రష్యన్  పత్రికలన్నీ ప్రము ఖంగా రాశాయిు. మన కమ్యూనిస్టులు ఈ చరిత్ర అంశా లను విస్మరించగా, మరోవైపున మన ప్రధాని నరేంద్ర మోదీ సోవియట్ విధానాలను ఆకళింపు చేసుకొని అదే స్థాయిలో మన జీడీ పీ కనీసం 20 శాతం పెరుగుతుందని అంచనా వేసి మార్చి 31 తరువాత జరిగే మార్పును చూడమని అంటున్నారు.
 
ఇప్పటి వరకూ ప్రపంచంలో ఐదు దేశాలు కరెన్సీని రద్దు చేశారుు కానీ వాటి ద్వారా సంస్కరణలు అంతంత మాత్రంగానే జరిగాయి. ఘనా దేశంలో 1982లో పన్నులను తగ్గించడానికి 50 సిడి కరెన్సీ నోట్లను రద్దు చేసింది. దాంతో ఘనా ప్రజలు బ్యాంకులకు బదులు విదేశీ కరెన్సీని నమ్ముకున్నారు. నైజీరియాలో ముహ మ్మద్ బుహారీ నేతృత్వంలోని మిలటరీ ప్రభుత్వం 1984లో పాత నోట్లను రద్దు చేసి, రంగు రంగుల కరెన్సీ లను విడుదల చేసింది. అయినా.. కరెన్సీ రద్దుతో వచ్చిన  ఫలితం అంతంత మాత్రమే.
 

టీవీ గోవిందరావు
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, న్యాయవాది
మొబైల్: 98850 01925

మరిన్ని వార్తలు