జగమెరిగిన ‘జల’ దార్శనికుడు

26 Jan, 2017 01:08 IST|Sakshi
జగమెరిగిన ‘జల’ దార్శనికుడు

సందర్భం
వ్యవసాయ సంక్షోభానికి డాక్టర్‌ హనుమంతరావు వంటి నిపుణులు సూచించే పరిష్కారాలపై పాలకులు దృష్టి పెట్టలేదు. ఆయన అపార అనుభవాన్ని మన దేశం విస్మరించినా.. ఆఫ్రికా, వియత్నాం ప్రజలు మాత్రం ఉపయోగించుకుంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ చీఫ్‌ ఇంజనీర్, ‘వాలం తరి’ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టి. హనుమంతరావు ఇటీవల కన్నుమూశారు. మాన వాళి అభ్యున్నతికి ఆయన సుదీర్ఘ కాలం పాటు చేసిన నిరుపమాన సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన స్నేహి తులు, రైతులు, ఇంజనీర్లు, ఆర్థిక వేత్తలు, దేశభక్తులు బరువెక్కిన హృదయాలతో స్మరించుకున్నారు.

డా. హనుమంతరావు వినూత్నమైన చతుర్విధ జల వనరుల సంరక్షణ పద్థతిని ఆవిష్కరించారు. భారత్, వర్ధమాన దేశాల్లోని మెట్ట ప్రాంతాల చిన్న, సన్నకారు రైతాంగం జీవనోపాధుల అభివృద్ధికి ఈ ఆవిష్కరణను గొప్ప కానుకగా అందించారు. ఆయన జల సంరక్షణ పద్ధతి సరళమైనది. వర్షాధార భూముల్లో పంట మొక్కల వేరు వ్యవస్థలోనే 60% నీటి తేమ నిల్వ ఉంటుందని ఆయన గుర్తించారు. భూమిని కప్పి ఉంచే ఆచ్ఛాదన పంటలను పెంచడం ద్వారా భూమిలోని ఉష్ణోగ్రతను తగ్గించ గలిగితే వేరు వ్యవస్థలోని నీటి తేమ ఆరిపోకుండా చూడవచ్చు. మెట్ట పొలా ల్లోని చెట్లు, నత్రజనిని స్థిరీకరించే ద్విదళ జాతికి చెందిన ఆచ్ఛాదన పంటల వేళ్లు భూమి లోపలికి లోతుగా చొచ్చుకెళ్తాయి కాబట్టి.. భూగర్భంలో నీటి తేమను పట్టి ఉంచడంలో అవి తోడ్పడతాయి. మెట్ట భూముల్లో అర్ధచంద్రాకార వలయాలతో పాటు నీటి వాలుకు అడ్డంగా చిన్నపాటి ఆనకట్టలు, మట్టి కట్టలు, చెక్‌ డ్యామ్‌లను జాగ్రత్తగా నిర్మిస్తే ఆ పరిసరా ల్లోని రైతులు నీటి కరువును సమర్థవంతంగా ఎదుర్కో వడం సాధ్యమేనన్నది ఆయన దృఢ విశ్వాసం.

సాగునీటి భద్రత సాధనపై ఆయన అద్భుత ఆలో చనలను 1980వ దశకంలో తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించి చూశారు. ప్రజా సంక్షే మమే ధ్యేయంగా, నిస్వార్థంగా దేశాభివృద్ధికి పాటు పడే అరుదైన ఐఏఎస్‌ అధికారి, అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దివంగత స్మరజిత్‌రేతో పాటు ఎస్‌.ఆర్‌. శంకరన్, డా. వై.వి. రెడ్డి వంటి ఆదర్శప్రాయులైన ఉన్నతా ధికారుల పర్యవేక్షణలో డా. హనుమంతరావు చతుర్విధ జలసంరక్షణ పద్ధతులను ప్రయోగాత్మకంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టు లకు అయ్యే ఖర్చులో అతికొద్ది శాతం నిధులతోనే రైతు లకు పుష్కలంగా సాగునీటి వనరులను అందుబాటులోకి తేవచ్చని ఈ గణాంకాలు చాటి చెప్పాయి.

అయితే, దురదృష్టవశాతూ ్త అవినీతిని కొమ్ముకాసే రాజకీయ నాయకులు, సాంకేతిక జ్ఞానంలేని వారి వంది మాగధులు డా. హనుమంతరావు గారి ఆలోచనలను ఆచ రణలోకి తేవడానికి అంగీకరించలేదు. భారీ నీటిపారు దల ప్రాజెక్టులకు బదులుగా చిన్న ప్రాజెక్టుల వల్ల పంట లకు సాగునీటి భద్రత చేకూర్చవచ్చని, ఎక్కువ ఎకరాలకు నీరు అందించవచ్చని ఆయన సూచించేవారు. తన ఆలోచ నలు స్థానికంగా అమల్లోకి రాకముందే ఆయన పదవీ విరమణ జరిగిపోయింది. అయితే, ప్రపంచంలో కొన్ని చోట్ల ఆయన ఆలోచనలకు ఆదరణ లభించింది.

మారిషస్‌ దేశం తీవ్ర నీటి కరువుతో సతమతమ వుతూ ఉండేది. అధిక ఖర్చుతో అమెరికా, యూరోపి యన్‌ దేశాల నుంచి కన్సల్టెంట్లను పిలిపించినప్పటికీ మారిషస్‌ నీటి సమస్య తీరలేదు. విదేశాల నుంచి ఆహా రాన్ని దిగుమతి చేసుకోవడం మినహా గత్యంతరం లేదని వారు తేల్చి చెప్పారు. మారిషస్‌ ప్రభుత్వం డా. హనుమం తరావుగారి చతుర్విధ జల సంరక్షణ పద్ధతుల గురించి తెలుసుకొని ఆయనను సంప్రదించింది. మారిషస్‌ ద్వీపం నీటికి కరువే లేదని, పుష్కలంగా నీటి వనరులు ఉన్నా యన్న వాస్తవాన్ని డా. హనుమంతరావు నిరూపించారు. ఆహారోత్పత్తులను అంతకుముందు మాదిరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మలే సియాకు లేకుండా పోయింది.

ఆయన జ్ఞానానికి అంతర్జాతీ యంగా గుర్తింపు లభించింది. ఐక్య రాజ్యసమితి కన్సల్టెంటుగా కనీసం డజను దేశాల్లో నీటి సమస్య పరిష్కా రానికి తోడ్పాటునందించారు. తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత తన స్వరా ష్ట్రంలో నీటి సమస్య పరిష్కారానికి ఉచితంగా సేవలందిస్తానని ఆయన ప్రకటించారు. కానీ, ఆయన సేవలను ఉపయోగించుకున్నవారు లేరు. వయసు మీద పడిన దశలో కూడా ఏదైనా స్వచ్ఛంద సంస్థ లేదా స్థానిక సంస్థ కోరితే ఉచి తంగానే సలహాలు ఇచ్చేవారు. రోజంతా మండు టెండలో నిలబడి సైతం క్షేత్రస్థాయిలో ఆయన సలహాలు ఇచ్చే వారు.

తమిళనాడు రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర కరువు పరిస్థితు లను ఎదుర్కొంటున్నది. రుణాల వసూళ్ల గడువును వాయిదా వేయడం, ఉపాధి హామీ పథకం కింద పేదలకు పనులు కల్పించడం జరుగుతున్నది. గత ఏడాది దేశ వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి వాన దేవుడ్ని నిందించడం మనకు తెలుసు. అయితే, వ్యవసాయ సంక్షోభానికి డా. హనుమంతరావు గానీ, కర్ణాటకలోని డా. ఆర్‌. ద్వారకానాథ్‌ వంటి దిగ్గజా ల్లాంటి నిపుణులు సూచించే పరిష్కార మార్గాలపై పాల కులు ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. వీరు చూపే పరిష్కార మార్గాలు నేరుగా రైతులకు ఉపయోగపడతాయే గాని అవినీతికి ఆస్కారం ఇచ్చేవి కావు. డా. హనుమంతరావు దార్శనికత, అపారమైన అనుభవం, నిబద్ధతలను మన దేశం విస్మరించినప్పటికీ.. ఆఫ్రికా, వియత్నాం ప్రజలు మాత్రం ఉపయోగించుకోగలగడం విశేషం.

విఠల్‌ రాజన్‌
ప్రముఖ రచయిత, ఆర్థికవేత్త, హక్కుల కార్యకర్త, ప్రత్యామ్నాయ నోబెల్‌ ప్రైజ్‌ జ్యూరీ సభ్యులు 97045 40608
 

మరిన్ని వార్తలు