ఎంపీలు ఒత్తిడి తెస్తే ‘జోన్‌’ ఖాయం

30 Jan, 2018 14:17 IST|Sakshi

రైల్వే బోర్డు మెంబర్‌ జాన్‌బాబు సంచలన వ్యాఖ్యలు

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎంపీలు సహకరిస్తే విశాఖ రైల్వే జోన్ త్వరగా వస్తుందని రైల్వే బోర్డు మెంబర్ జాన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్‌లో రైల్వేకు అధిక కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు వెయ్యి కోట్లు అవసరం ఉంటుందని, జోన్ నిర్ణయం జరిగితే ఈ బడ్జెట్‌లో కొంత కేటాయింపులు జరుగుతాయని వివరించారు. జోన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ విశాఖ ఎంపీలు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవడం లేదని, వారు ఒత్తిడి తెస్తే జోన్ సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎంపి హరిబాబు బోర్డు వద్ద జోన్ అంశం ప్రస్తావనకు తేలేదని, వేరే సమస్యలు తప్ప విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఆయన కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు