జిల్లాను అభివృద్ధి బాట పట్టిస్తా..

17 Jun, 2019 11:10 IST|Sakshi
ప్రచార రథంపై నుంచి అభివాదం చేస్తున్న మాడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, పక్కన అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శరగడం చినఅప్పలనాయుడు

తుదిశ్వాస వరకూ అధినేత అడుగుజాడల్లోనే పయనిస్తా..

మాడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు

సాక్షి, విశాఖపట్నం: అతి సామాన్య జీవితం నుంచి రాజకీయాలోకి వచ్చిన తనకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రుణం తీర్చుకుంటానని, జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తానని మాడుగుల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు అన్నారు. తనకు తుది శ్వాస ఉన్నంతవరకూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తానని... మరో 25 ఏళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారం అమరావతి నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

గత ఐదేళ్లుగా టీడీపీ అరాచక పాలనతో విసుగు చెం దిన రాష్ట్ర ప్రజలందరూ రాజన్న రాజ్యం కావాలని కోరుకుని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపిం చారన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా హామీలను అమలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు, మధ్యాహ్నం భోజన సహా యకులు, మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల జీతా లు, పోలీసులకు వీక్లీ ఆఫ్, వృద్ధాప్య పింఛన్లు పెంచి రాజన్న రాజ్యానికి స్వాగతం పలికారన్నా రు. మంత్రివర్గ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం కల్పిస్తూ.. అణగారిన కూలాలకు పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన కులానికి చెందిన తమ్మినేని సీతారాంని స్వీకర్‌గా, తనను ప్రభుత్వ విప్‌గా నియమించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమైందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి పేద, బడుగు బలహీనవర్గాల ప్రజల గుండెల్లో జగన్‌మోహన్‌రెడ్డి చెరగని ముద్ర వేసుకుంటారన్నారు.

అడుగడుగునా బ్రహ్మరథం 
సుమారుగా 5 వేలకుపైగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు భారీ ఊరేగింపుతో ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు. అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అభినందనలు తెలియజేస్తూ కేక్‌ కట్‌చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు శాలువాలతో, పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట సీనియర్‌ నేతలు చిక్కాల రామరావు, వీసం రామకృష్ణ, అనకాపల్లి పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి సుంకర శ్రీనివాసరావు,  జెడ్పీటీసీ సభ్యుడు సంజీవరావు ప్రభావతి, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, విశాఖ, అరకు పార్లమెంట్‌ విద్యార్థి విభాగం నాయకులు కాంతారావు, సురేష్, మాడుగుల, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గ పార్టీ నాయకులు సంజీవరావు ప్రభావతి, అట్టాడ శివకుమార్, డి.బాబురావు, పోలగట్ల పాపారావు, యర్రా అప్పారావు, టి.రాజారామ్, కిలపర్తి భాస్కర్‌రావు, కర్రిసత్యం, రెడ్డి జగన్‌మోహన్, కె.డేవిడ్, పెదబాబు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు