ఉద్యోగం కోసం పోటెత్తిన నిరుద్యోగులు

29 Jan, 2018 09:54 IST|Sakshi
సర్టిఫికెట్ల పరిశీలన కోసం బారులు తీరిన యువతీ యువకులు

చిత్రంలో కనిపిస్తున్నవారిని చూశారా.. వీరంతా ఉద్యోగం కోసం ఆశగా వచ్చిన వేలాదిమంది నిరుద్యోగులు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఉద్యోగ నోటిఫికేషన్‌లు మాయమయ్యాయి. రాజకీయ వివక్షతో చిరుద్యోగులు ఉపాధికి దూరమయ్యారు. బతుకుకోసం డిగ్రీ పట్టాలు చేతపట్టి వీధిన పడ్డారు. డెంకాడ మండలం చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం జరిగిన జాబ్‌ మేళాకు కోటిఆశలతో హాజరయ్యారు. ఇక్కడ వేలల్లో ఉన్న నిరుద్యోగులను చూసి.. బిత్తర పోయారు.  అయ్యో.. రాష్ట్రంలో నిరుద్యోగం ఇంత దారుణంగా ఉందా అంటూ నిరాశచెందారు.  బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని.. బాబు పోతే తప్ప ఈ దుస్థితి మారేలా లేదంటూ కొందరు విమర్శించారు.

డెంకాడ: చింతలవలస ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డీఆర్‌డీఎ, వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు నిరుద్యోగ యువ త పోటెత్తింది. పేర్లు న మోదుకు గంటల తరబడి వేచి ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 34 కం పెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు విచ్చేసి నిరుద్యోగ యువతీయువకులకు పరీక్షలు నిర్వహిం చారు. అందులో ప్రతిభ చూపిన వారికి ఇంట ర్వ్యూ చేశారు. ముందుగా ఆయా కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలు... జీతభత్యాలు.. షరతులు తదితర వివరాలను తెలియజేశా రు. అయితే... రెండు రోజుల పాటు నిర్వహించే జాబ్‌మేళాకు పదివేల మంది హోజరుకాగా.. రెండోరోజు ఆది వారం నిర్వహించిన జాబ్‌ మేళాకు సుమారు ఆరువేల మంది రావడంతో కళాశాల మైదానం కిక్కిరిసింది. మూడేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం... వేలాది మంది విద్యార్థులు ఏటా డిగ్రీలు, ఇంజినీరింగ్‌ పట్టాలతో రిలీవ్‌కావడంతో జాబ్‌ మేళాకు పోటెత్తారు.

అక్కడి నిరుద్యోగ లోకాన్ని చూసి కొంద రు బిక్కయిపోయారు. పరీక్ష రాయకుండానే ఇంటిముఖం పట్టారు. మరికొందరు గంటల తరబడి నిరీక్షిం చి ప్రతిభకు పదును పెట్టారు. ఏటా ఉద్యోగాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని... నేతల ప్రకటనలకు.. ఆచరణకు ‘నక్కకి నాగలోకానికి ఉన్నంత’ తేడా ఉందంటూ నిట్టూర్చా రు. బాబు వస్తే జాబు వస్తుందని ఆశపడ్డామని... ఇప్పుడు బాబుకు చెక్‌చెబితే తప్ప జాబు వచ్చే అవకాశం కనిపించడంలేదంటూ బహిరంగంగానే విమర్శించారు. ప్రభుత్వ కొలు వులు లేకపోవడంతో కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలకు వేలాది మంది తరలివస్తున్నారంటూ విద్యార్థులకు తోడుగా వచ్చి న తల్లిదండ్రులు పేర్కొన్నారు. పల్లెల్లో ఉంటే చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారని.. ఉద్యోగాలు చూసుకోమని చెబితే మీరే చూపిం చండంటూ సమాధానం చెబుతున్నారన్నారు. 

ఉద్యోగ కల్పనకు చర్యలు
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖా మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు అన్నారు. జాబ్‌మేళా ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రెండు రోజుల్లో పదివేల మంది యువతీ యువకులు హాజరుకాగా,  2 వేల మంది ఉద్యోగాలకు అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పతివాడ, గీతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు