‘దళితులను దగాచేస్తున్న ప్రభుత్వం’

12 Feb, 2018 16:25 IST|Sakshi
మాట్లాడుతున్న అద్దంకి దయాకర్‌

గోపాల్‌పేట : దళితులను దగా చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలంగాణ మాల మాహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.  ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపించారు.   నాలుగేళ్లలో దాదాపు రూ.95వేల కోట్లను సీమాంధ్ర కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు నలుగురితో బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నారు.

అంబేద్కర్‌ సుజల స్రవంతి పేరును కాళేశ్వరంగా మార్చి అంబ్కేదర్‌ను అవమానించారన్నారు. తెలంగాణ కోసం పనిచేసిన ప్రొఫెసర్‌ కోదండరాం పర్యటిస్తే జైల్లో పెడతారు.. అదే కేసీఆర్‌ను తిట్టిన పవన్‌ కల్యాణ్‌ మాత్రం పర్యటించ వచ్చా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు కేటాయించడమే తప్ప ఖర్చు చేయడం లేదన్నారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. త్వరలో నడిగడ్డలో దళితగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తుమ్మల రవికుమార్, శ్రీనివాస్,  కృష్ణ, రవికుమార్‌ ఉన్నారు. 

Read latest Wanaparthy News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా