సెంట్రల్‌ జైలులో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

21 Jan, 2018 11:17 IST|Sakshi

వరంగల్‌: వరంగల్‌ సెంట్రల్‌జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ శిక్షణ ల్యాబ్‌ను కలెక్టర్‌ అమ్రపాలి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీలు చదువుతో పాటు కంప్యూటర్‌ నేర్చుకోవాలని సూచించారు. విడుదలైన ఖైదీలకు రుణాలు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, మహి ళా ఖైదీలకు కుట్టు మిషన్లు, సిబ్బంది ఉండే క్వార్టర్స్‌లో చిల్రన్స్‌పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

 జైలు సూపరింటెండెంట్‌ మురళీబాబు మాట్లాడుతూ జైళ్ల శాఖ డీజీపీ వినోయ్‌కుమార్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.  ఈ సందర్భంగా మహేష్‌ అనే ఖైదీ స్వయంగా గీసిన కలెక్టర్‌ చిత్రపటాన్ని కలెక్టర్‌ అమ్రపాలికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌జైలు ఉప పర్యవేక్షణ అధికారి జీఎం.శ్రీనివాస్, జైలర్లు నిరంజన్‌రెడ్డి, నర్సింహస్వామి, సక్రూ, అరుణ్‌కుమార్, డిప్యూటీ జైలర్లు ఎం.శ్రీనివాస్, ఆర్‌.శ్రీనివాస్, ఎ.శ్రీనివాస్, ఎం.శ్రీధర్, కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు