ఓరుగల్లుకు నిరంతర సాగునీరు

14 Jan, 2018 11:13 IST|Sakshi

కాళేశ్వరం ప్రాజెక్టు మానేరుకు అనుసంధానం

ఆరునెలల్లో పనులు పూర్తి

డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

ఎస్సారెస్పీ పనులు ప్రారంభం

హసన్‌పర్తి: రానున్న ఆరునెలల్లో ఓరుగల్లుకు నిరంతరం సాగునీరు, తాగునీరు అందించనున్నట్లు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా 191–234 కిలోమీటర్ల వరకు సుమారు రూ.122.9 కోట్లతో చేపట్టనున్న శ్రీరాంసాగర్‌ మరమ్మతు పనులను శనివారం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును మానేరుకు అనుసంధానం చేసి కాకతీయ కాల్వలకు నీరు విడుదల చేస్తామన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద మొదటి విడత రూ.60 కోట్లతో పనులు పూర్తి చేశామని, రెండో విడతలో మరో రూ.270 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.  వ్యవసాయానికి  24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కడియం వెల్లడించారు.

డీబీఎం కాల్వల ఆధునీకరణ
ఎస్సారెస్పీ ప్రధాన కాల్వలతో పాటు డీబీఎం, మైనర్‌ కాల్వలను కూడా ఆధునీకరించనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారతో పాటు పూడికతీత పనులు చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే పలివేల్పుల గ్రామం గుండా ఎస్సారెస్పీ కాల్వపై వంతెన మంజూరు చేశామని, దాని నిర్మాణం కోసం రూ. 1.54 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్‌ మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రెండు పంటలకు నీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ దయానంద్, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ పోచయ్య, డీఈ బాలకృష్ణ, ఏఈ మాధవరావు, కార్పొరేటర్లు జక్కుల వెంకటేశ్వర్లు, నాగమళ్ల ఝాన్సీ, సర్వోత్తంరెడ్డి, సిరంగి సునీల్‌కుమార్, బానోతు కల్పన, వీర భీక్షపతి, ఎంపీపీ కొండపాక సుకన్య,రఘు, జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్, బిల్లా ఉదయ్‌కుమార్‌రెడ్డి, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మేర్గు రాజేష్, వల్లాల యాదగిరి, రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్‌ అంచూరి విజయ్, నాయకపు శ్రీనివాస్, గడ్డం శివరాంప్రసాద్, చకిలం చంద్రశేఖర్, దేవరకొండ అనిల్,  రజనీకుమార్, రమేష్, సర్పంచ్‌ రత్నాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు