సమ్మక్క వంశీయుల పూజలు

26 Jan, 2018 16:15 IST|Sakshi
సమ్మక్కకు పూజలు చేస్తున్న చందా వంశస్తులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క గద్దె వద్ద బయ్యక్కపేటకు చెందిన చందా వంశస్తులు గురువారం మొక్కులు చెల్లించారు. సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేట అనే చరిత్ర ఉంది. అయితే ప్రతి ఏటా జాతర సందర్భంగా సమ్మక్కకు తొలి మొక్కులు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు చందా వంశస్తులు బయ్యక్కపేట నుంచి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం, చీరసారె, గాజులు, పూలు తీసుకువచ్చి సమ్మక్క గద్దె వద్ద పూజలు నిర్వహించారు.

జాతర సమయంలోనే సమ్మక్కకు ఆనవాయితీగా పూజలు నిర్వహించాల్సిన ఉన్నప్పటికీ రద్దీ కారణంగా ముందుగానే తల్లికి మొక్కు చెల్లించినట్లు చందా వంశీయులు తెలిపారు. డోలు వాయిద్యాలతో సమ్మక్క గద్దెపైకి వెళ్లి మొక్కులు సమర్పించారు. సమ్మక్కకు తొలి పూజల సందర్భంగా చందా వంశస్తులు, వడ్డెల ఇళ్లలో ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని వార్తలు