కాగితం కొరత తీరినట్లే!

6 Feb, 2019 17:15 IST|Sakshi

ముంబై: పుస్తకాలు, నోటుబుక్స్, డెయిలీ పేపర్‌.. వీటన్నింటికీ కాగితమే ఆధారం. ఈ కాగితం తయారీకోసం లక్షలాది చెట్లు నరకాల్సి వస్తోంది. ఫలితంగా పర్యావరణం దెబ్బతింటోంది. అయితే ఇకపై చెట్లను నేలకూల్చకుండానే సరిపడా కాగితాన్ని తయారుచేసుకోవచ్చు. ఇందుకు చైనా తీసుకున్న తాజా నిర్ణయమే కారణం. కాగితాలు, ప్లాస్టిక్‌ వంటి పునర్వినియోగ చెత్త దిగుమతులపై చైనా నిషేధం విధించింది.

దీంతో కోట్ల టన్నుల కాగితపు చెత్త పేరుకుపోయి.. పశ్చిమ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు ఆ దేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయి. నిజానికి భారత్‌లో తయారయ్యే కొత్త కాగితంలో 60 శాతంచిత్తు కాగితాల రీసైక్లింగ్‌ వల్లే ఉత్పత్తి అయ్యిందే. దీంతో విదేశాల నుంచి చౌకగా వస్తున్న చెత్త కాగితాలను వీలైనంత ఎక్కువ దిగుమతి చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఫలితంగా తక్కువ ధరకే దేశ ప్రజలకు కాగితం అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు