గాడిదలు కావాలండోయ్‌: చైనా

2 Jan, 2018 11:38 IST|Sakshi

బీజింగ్‌ : ఇతర దేశాలకు తమ వస్తువులను ఎగుమతి చేస్తూ తమదైన ముద్ర వేసుకున్న చైనాకు.. ఓ విషయంలో మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది. అదేంటో కాదండోయ్‌.. గాడిద చర్మం. అవును గత కొన్నేళ్లుగా చైనాలో​ గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గిపోయిందంట. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన చైనా ప్రభుత్వం ఇతర దేశాల్లోని తోలు విక్రయదారులను ఆకర్షించే పనిలో పడింది. దీనిలో భాగంగానే గాడిదల దిగుమతులపై విధించే సుంకాన్ని ఏకంగా 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించింది.

ప్రస్తుతం చైనాలో గాడిద తోలుకు మంచి గిరాకీ ఉండటంతో భారీ రేటు పలుకుతోంది. ఒక్కో గాడిద తోలు మన కరెన్సీలో సుమారు రూ.30వేలు పలుకుతోంది. దీనికి కారణం గాడిద చర్మాన్ని కాచి తీసిన జిగురు పదార్థం జెలిటిన్‌కు ఫుల్‌ డిమాండ్‌ ఉండటమే.  దీన్ని చర్మ సౌందర్యాన్ని పెంచే సంప్రదాయ జౌషదాల్లోనూ వాడుతారు. అంతేకాకుండా గాడిద మాంసాన్ని చైనీయులు ఇష్టంగా తింటారు. దీంతో చైనాలో గాడిదల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చైనా దెబ్బకు తమ దేశాల్లోని గాడిదలు తగ్గుతాయని పక్క దేశాలు గొల్లుమంటున్నాయి.

మరిన్ని వార్తలు