ఫీల్‌ ది పీల్‌..

11 Sep, 2019 08:59 IST|Sakshi

జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నారింజ రసాన్ని ఎంచక్కా ఆస్వాదించే ఉంటాం మనం. రసం తాగేసిన తర్వాత మిగిలిపోయే పిప్పి గురించి మాత్రం పెద్దగా పట్టించుకోం. కానీ.. ఇటలీ డిజైనింగ్‌ కంపెనీ కార్లో రట్టీ అసోసియాటీ మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంది. అందుకే వృథాగా పారబోసే పిప్పితోనే గ్లాస్‌లను తయారు చేయడం మొదలుపెట్టింది.

ఈ యంత్రం అదే. ‘ఫీల్‌ ద పీల్‌’అని పిలుస్తున్న ఈ యంత్రం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. పైన ఉన్న గుండ్రటి ఛత్రం వంటి నిర్మాణంలో సుమారు 1500 నారింజ పండ్లు ఉంటాయి. అవసరమైనప్పుడు ఇవి నేరుగా కిందకు వస్తాయి. ఒక్కో పండును రెండుగా కోసేందుకు బ్లేడ్‌ ఉంటే.. రసం తీసేందుకు ఇంకో యంత్రం ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మిగిలిపోయే తోలును, పిప్పిని అక్కడికక్కడే సూక్ష్మస్థాయి పోగులుగా మార్చి, త్రీడీ ప్రింటర్‌ సాయంతో కప్పులు తయారు చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. 

మరిన్ని వార్తలు