రికార్డు సృష్టించిన జూలై

17 Aug, 2019 02:26 IST|Sakshi

ఇప్పుడైతే శాంతించాయి గానీ.. రెండు నెలల కింద ఎండలు మండిపోయిన విషయం మనకు తెలిసిందే.. ఇదే విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ధ్రువీకరించింది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జూలైలో ఎన్నడూ లేని స్థాయి లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూరప్, అమెరికాతో పాటు భూ ఉత్తరార్ధ గోళంలోని అనేక దేశాల్లో వడగాడ్పులు ప్రజలను ఠారెత్తించాయి. ఈ ఏడాది తొలి 6 నెలల ఉష్ణోగ్రత రెండో స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. జూలైలో భూమి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెల్సియస్‌ ఎక్కువగా ఉన్న ట్లు స్పష్టం చేసింది. 20వ శతాబ్దం మొత్తమ్మీద సగటు ఉష్ణోగ్రతలు 15.8 డిగ్రీ సెల్సియస్‌ ఉండగా.. జూలై ఉష్ణోగ్రత 16.75 డిగ్రీలుగా నమోదైంది. మూడేళ్ల కింద అంటే 2016లో సుమారు 16 నెలల పాటు రికార్డు స్థాయి ఉష్ణో గ్రతలు నమోదైన తర్వాత అంతటి ఉష్ణోగ్రత లు నమోదు కావడం ఇదే తొలిసారి. 1998 తర్వాత జూలైలో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతూ వస్తున్నాయని  శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.   

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు