ఫోర్జరీ సంతకంతో డబ్బులు స్వాహా..

19 Aug, 2019 11:26 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : మహిళా సంఘం బాగోగులు చూడాల్సిన ఓ ‘సీఏ’ సంఘం సభ్యులను మోసం చేసి, ఫోర్జరీ సంతకంతో డబ్బులు ‘డ్రా’ చేసింది. సొంతంగా వాడుకున్న విషయమై ఏపీఎంకు చేసిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. మహిళా సంఘం డబ్బులు సంఘం బాధ్యులు దుర్వినియోగం చేయకుండా నెల నెలా సంఘం లెక్కలు చూడాల్సిన సీఏ మహిళా సంఘం డబ్బులు రూ.70 వేలను బ్యాంక్‌ నుంచి డ్రా చేసిన సంఘటన నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో జరిగింది. ఈ విషయాన్ని అయ్యప్ప పొదుపు సంఘం సభ్యురాలు, గ్రామ 4వ వార్డు సభ్యురాలు తోపుచర్ల పద్మ ఆదివారం ఏపీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గ్రామానికి చెందిన సాయిరాఘవ పొదుపు సంఘం సీఏ సుజాత సంఘానికి సంబంధించిన డబ్బులను నెక్కొండ ఏపీజీవీబీ నుంచి డిసెంబర్‌ 2018లో రూ.10వేలు, మార్చి 2019లో రూ.20 వేలు, ఏప్రిల్‌లో రూ.40 వేలను బ్యాంక్‌ నుంచి డ్రా చేసినట్లు ఆమె తెలిపారు.

సంఘానికి సంబంధించి నెల నెలా లెక్కలు ఉండడంతో రికార్డులు, ముద్రలు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు సీఏ వద్ద ఉండేవన్నారు. దీంతో మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు మరో 8 మంది సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, తీర్మాణం రాసి బ్యాంక్‌ అధికారులను మోసం చేసి డబ్బులను తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఈ నెల 17న తాను బ్యాంక్‌ వెళ్లగా ఈ విషయం తెలిసిందని ఆమె పేర్కొన్నారు. సంఘం సభ్యులందరూ బ్యాంక్‌ అధికారుల ఎదుట హాజరైతేనే సంఘానికి రుణం మంజూరు చేయాల్సి ఉండగా కేవలం సీఏను నమ్మి ఎలా డబ్బులు డ్రా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఏపీఎం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. విచారణ చేసి డబ్బులు స్వాహాకు పాల్పడిన సీఏ సుజాతపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏపీఎం తెలిపారు. 

Read latest World News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ. 45,770 కోట్లు  తప్పనిసరి ఖర్చు

భూగర్భంలో మెట్రో పరుగులు!

9... నెమ్మది!

సంక్షేమం స్లో...

కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే 

రూ.91,727 కోట్ల భారం

మిగులు కాదు.. లోటే !

అప్పు.. సంపదకే!

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

ఈనాటి ముఖ్యాంశాలు

‘కేసీఆర్‌.. ఫ్రంట్, టెంట్ ఎక్కడ పోయింది?’

‘తప్పు చేస్తే ఎవరినైనా కఠినంగా శిక్షిస్తాం’

కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదు: కేసీఆర్‌

పీఏసీ చైర్మన్‌గా అ‍క్బరుద్దీన్‌ ఒవైసీ

ఆఖరి మోఖా!

18 గంటలుగా సెల్‌ టవర్‌పైనే..

మోగిన ఉప ఎన్నిక నగారా !

నీలగిరితోటల్లో పులి సంచారం

జే7 ఫోన్‌ పేరుతో మోసం చేసిన యువతి

‘మేడిగడ్డపై అడ్డగోలు మాటలు’

గరం..గరం చాయ్‌; గాజు గ్లాస్‌లోనే తాగేయ్‌..

కృష్ణానది బ్రిడ్జిపై రక్తపు మరకలు 

అక్క ప్రేమను ఒప్పుకున్నారు.. కానీ చెల్లి ప్రేమను

నాగార్జున సాగర్‌ గేట్లు మూసివేత

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ: అందుకు మోదీ కారణం

వామ్మో.. మొసలి

హరిత ప్రణాళికలు సిద్ధం

ఉద్యోగాలన్నీ పచ్చగా..

ప్రాణం మీదకు తెచ్చిన  టిక్‌టాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డేట్‌ ఫిక్స్‌?

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా సైరా: చిరంజీవి

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌

‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’