తిరుమలలో సర్వ దర్శనానికి 26 గంటలు

26 Dec, 2017 08:43 IST|Sakshi

శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. 29, 30లలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు దర్శనం నిలిపివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కానుంది. 28 నుంచి ఐదు రోజులపాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 26 గంటలు పట్టే అవకాశం ఉంది. సోమవారం 88,507 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. ‌33,102 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారికి హుండీ ఆదాయం రూ.4కోట్లు వచ్చింది.

మరిన్ని వార్తలు