ఎందాకైనా..

4 Jun, 2016 03:04 IST|Sakshi
ఎందాకైనా..

దిగ్విజయంగా కొనసాగుతున్న రైతు భరోసా యాత్ర
కన్నీరు తుడుస్తూ.. భరోసానిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్
మూడోరోజు రెండు కుటుంబాలకు  పరామర్శ
జనాభిమానం మధ్య గంటల తరబడి ముందుకు కదలని కాన్వాయ్
యాడికి దాటేందుకు 4.30 గంటలు పట్టిన వైనం
పెద్దపప్పూరులోనూ భారీ జనం
తాడిపత్రి నియోజకవర్గంలో ముగిసిన యాత్ర..  మొత్తం 9 కుటుంబాలకు భరోసా
నేడు కదిరి నియోజకవర్గంలో పర్యటన.. ఎన్‌పీ కుంట సోలార్ బాధితులతో ముఖాముఖి

 
సాక్షిప్రతినిధి, అనంతపురం
: సర్కారు మోసపూరిత హామీల కారణంగా ఇంటి పెద్దను కోల్పోయారు. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని రైతు ఆత్మహత్యల జాబితాలో చేర్పించి.. బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించడంలో విఫలమయ్యారు. అండ దూరమై..ఆసరా కరుైవె .. అగచాట్లలో ఉన్న కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అండగా నిలుస్తున్నారు. ‘నేనున్నా’నంటూ కన్నీరు తుడుస్తూ నే... సర్కారు చేస్తున్న అన్యాయంపై ఎందాకైనా పోరాడతానని స్పష్టం చేస్తున్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతులు, చేనేతల కుటుంబాలను పరామర్శిం చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజు శుక్రవారం తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి నుంచి  మొదలైంది. ఉదయం తొమ్మిది గంటలకు యాత్ర ప్రారంభించారు. స్థానిక నేతలు,  అభిమానులు జగన్‌తో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. తర్వాత కాన్వాయ్ ముందుకు కదిలింది. యాడికిలో జగన్ బస చేసిన రామిరెడ్డి ఇంటి నుంచి చెన్నకేశవస్వామి గుడివద్దకు కాన్వాయ్ వచ్చేందుకు నాలుగు గంటలు పట్టింది. వేలాదిమంది ప్రజలతో యాడికిలోని గుత్తి-తాడిపత్రి ప్రధాన రహదారి కిక్కిరిసి పోయింది.


అభిమాన నేతను చూసేందుకు మహిళలు భారీగా తరలివచ్చారు. చెన్నకేశవస్వామిగుడి వద్ద జనసందోహాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వ మోసపూరిత విధానాలపై దుమ్మెత్తిపోశారు. కాన్వాయ్ యాడికి దాటేందుకు ఏకంగా 4.30 గంటలు పట్టింది. తర్వాత నగరూరు మీదుగా కమ్మవారిపల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి పసలూరు మీదుగా గార్లదిన్నెకు చేరుకున్నారు. గ్రామస్తులు  ఘనస్వాగతం పలికారు. తర్వాత ఆశ్వర్థ చక్రభీమలింగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి..ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుండి చిన్నపప్పూరు చేరుకున్నారు. గ్రామస్తులు  పూలవర్షం కురిపించారు. దిష్టితీసి హారతిపట్టారు. జగన్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. రామకోటి గ్రామానికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. తర్వాత షేక్‌పల్లి, నామనాంకపల్లి, వరదాయపల్లి మీదుగా ముచ్చుకోటకు చేరుకున్నారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు లీలాకృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు.

దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో యాత్ర పూర్తయింది. మొత్తం ఏడుగురు రైతులు, ఇద్దరు చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. అక్కడి నుంచి నేరుగా కదిరి పట్టణానికి చేరుకుని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బస చేశారు. మూడోరోజు యాత్రలో  ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు వై. వెంకట్రామిరెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, వీఆర్ రామిరెడ్డి, అదనపు సమన్వయకర్త రమేశ్‌రెడ్డి, పార్టీనేతలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, చవ్వారాజశేఖరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మీసాల రంగన్న, జిల్లా అధికారప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, బీసీ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు పామిడి వీరాంజనేయులు, పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు