-

108 బతికించింది..

8 Jul, 2017 00:30 IST|Sakshi
108 బతికించింది..
- 108... ఆపత్కాలంలో కుయ్‌కుయ్‌..
అంటూ వచ్చి లక్షలాది మంది ప్రాణాలు నిలిపింది ‘108’ అంబులెన్స్‌!
 
వారిలో జగిత్యాలకు చెందిన ఏదుల నాగయ్య ఒకరు. ఆయన నాడు 108 తనను ఎలా కాపాడిందో వివరించారు. ‘‘మాది పేద కుటుంబం. కిరాణా వ్యాపారం చేస్తుంటా. ఇద్దరు కొడుకులు. రెండేళ్ల కిందట నాకు సడెన్‌గా గుండెపోటు వచ్చింది. 108కు ఫోన్‌ చేశాం. వెంటనే జగిత్యాల నుంచి 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ గుండెపోటుగా గుర్తించి స్టెంట్‌ వేయాలన్నారు. దగ్గర డబ్బుల్లేవు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని అడిగారు. ఉందనడంతో ఆపరేషన్‌ ఉచితంగా చేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. వైఎస్‌ ప్రవేశపెట్టిన ఆ 108 పథకం వల్లే నేను ఈ రోజు భార్యాపిల్లలతో కలసి ఉన్నా. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి’’ అంటూ నాగయ్య ఉద్వేగంగా చెప్పారు.
- ఏదుల నాగయ్య
మరిన్ని వార్తలు