గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

7 Jan, 2018 08:37 IST|Sakshi

సాక్షి, తిప్పిరెడ్డిపల్లె(చాపాడు): తిప్పిరెడ్డిపల్లెలో శనివారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలి గ్రామానికి చెందిన పామిడి ఓబయ్యకు చెందిన ఇల్లు దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. రాత్రి ఇంట్లోకి వెళ్లిన ఓబయ్య భోజనం చేసుకునేందుకు గ్యాస్‌ స్టవ్‌ వెలిగించేందుకు ప్రయత్నించగా ఉన్నట్టుండి స్టవ్‌ పేలింది.

వెంటనే అప్రమత్తమైన ఆయన బయటికి రాగా ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోని సామగ్రితో పాటు లక్ష రూపాయల నగదు, తులానికి పైగా ఉన్న ఉంగరం కాలిపోయాయి. ఫైర్‌ ఇంజిన్‌ వెంటనే వచ్చి మంటలను ఆర్పి వేసింది.  

Read latest Ysr News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు