25వ వారం మేటి చిత్రాలు
23 Jun, 2018 21:25 IST
1 / 44
నిప్పులు కక్కడంలో నీకెవరు సాటి. పొట్టకూటి కోసం ఆగదుగా ఈ పోటీ..!! (ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ)
2 / 44
చేపల వేటగాళ్లు.. ‘గుర్రపు డెక్కల’పై సవారీ..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
3 / 44
గ్రామ సింహాల సంగ్రామానికి సాగిపోతున్న పరివారమా..? (ఫోటో: అజీజ్, మచిలీపట్నం)
4 / 44
అప్పుడే ఈ చదువులేంట్రా బాబూ..!! (ఫోటో: కిశోర్, విజయవాడ)
5 / 44
మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం.. పరిశీలన చేస్తున్న మంత్రి పరిటాల సునీత (ఫోటో: బాషా, అనంతపురం)
6 / 44
నీడ కరువాయే.. సోలారు శక్తినిచ్చే చెట్టే దిక్కాయే..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
7 / 44
అంతా చేరారు.. అందంగా తీర్చిదిద్దారు..! సెల్యూట్ పోలీసులు..! (ఫోటో: బాషా, అనంతపురం)
8 / 44
ఆసరా ఉందో లేదోగానీ.. అవ్వకు నేనున్నా..!! (ఫోటో: రాంగోల్రెడ్డి, గుంటూరు)
9 / 44
నీటి కరువు కాదు.. బతుకు దెరువు బరువైంది.. రోడ్డు పాల్జేసింది..!! (ఫోటో: దయాకర్, హైదరాబాద్)
10 / 44
మబ్బులు మాత్రమే కమ్మాయి..! బుద్ధుడి వెలుగులపై అనుమానం వద్దు..!! (ఫోటో: దేవేంద్ర, హైదరాబాద్)
11 / 44
మనసు పవిత్రతే ముఖ్యం..! భగన్నామం భజించడానికి..!! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్)
12 / 44
చదువుల తల్లి ఒడిలో నాట్య మయూరి నటనలు చూడరే..!! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్)
13 / 44
కళా రథం.. భాగ్య నగర రోడ్ల వెంట పరుగిడుతోంది..!! (ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్)
14 / 44
విల్లువో.. ఎక్కుపెట్టిన పట్టుదల చెల్లివో..!! (ఫోటో: ఎం.రవికుమార్)
15 / 44
ఏడేడు జన్మాలైనా..! ఈ బంధమే కొనసాగిద్దామా..!! (ఫోటో: వి.రవీందర్, హైదరాబాద్)
16 / 44
నింగి నిడివి పెరిగింది, అరుణ కిరణ కాంతుల్లో అధిక సమయం దర్శనమిచ్చింది..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
17 / 44
అంతా ఆమె కోసమే..! ఆమే మా ప్రేమ..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
18 / 44
ట్రయల్ రన్ రెండోది..! మాతో సెల్ఫీ మాత్రం మొదటిదే..!! (ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్)
19 / 44
యోగా రాణీ సంజన గల్రానీ.. కసరత్తులతో కుర్రకారు పరేషానీ..! (ఫోటో: ఎస్ఎస్ టాకూర్, హైదరాబాద్)
20 / 44
ఫ్యాషన్ సంబరం ఆరంభంలో అందం తలుక్కుమంది..! (ఫోటో: ఎస్ఎస్ టాకూర్, హైదరాబాద్)
21 / 44
సప్తవర్ణ సింగిడీ నీడల్లో.. సాగరంలో బుద్ధుడు..!! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)
22 / 44
అద్భుత కళాఖండం కాదు..! సాయం వేళల్లో యోగా విన్యాసాలు.!! (ఫోటో: వేణుగోపాల్, జనగాం)
23 / 44
ఎండలు మండిపోనీ, కుండపోతగా వర్షం కురవనీ..! డోంట్‌కేర్..! (ఫోటో: వేణుగోపాల్, జనగాం)
24 / 44
తాతమ్మకు తోడుంటాం..! తనకు సాయమంటే సంబరపడతాం..! (ఫోటో: టి.రమేష్, కడప)
25 / 44
నెలవంక తొంగి చూసింది..! రంజాన్ పండగ మొదలైంది..! (ఫోటో: రాదారపు రాజు)
26 / 44
అంతర్జాతీయంగా యోగా వెలుగుతోందంటే.. మీ లాంటివాళ్ల చలవే..!! (ఫోటో: హుస్సేన్, కర్నూలు)
27 / 44
స్విమ్మింగ్‌లో డైయింగ్ కాదు..! చేపల హంటింగ్..!! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)
28 / 44
పచ్చగా తోచిందని పొరబడేరు..! నాచు పాగా వేయగా మూసుకు పోయిన చెరువిది..!! (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
29 / 44
చెప్పుల పార్కింగ్ కాదు.. చెక్కుల విడుదలలో రైతుల అవస్థలు..!! (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
30 / 44
కాళ్లకింది అపాయాన్ని కానండి తల్లీ..! అసలే అది పబ్లిక్ వర్క్్స వాళ్లు వేసారేమో..! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
31 / 44
లవ్లీ భామల లక్కీ చేతుల్లో మీరుంటే.. డ్రా మీదే..!! (ఫోటో: శ్రీశైలం, మేడ్చల్)
32 / 44
నరులకు దొరకను..! వనంలో రాటుదేలిన వానరాన్ని కదా..!! (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)
33 / 44
విద్యుత్ వెలుగులకై పనిచేస్తాం..! ఆటపాటల్లో ఒకటవుతాం..!! (ఫోటో: మహ్మద్ రఫి)
34 / 44
మా ప్రయత్నం యోగా డే ప్రచారం .! రోజూ చేస్తేనే మనసు ప్రశాంతం..!! (ఫోటో: కె.సతీష్, సిద్దిపేట)
35 / 44
ఈద్ ముబారక్ చిట్టీ..! అల్లాహ్ దీవెనలు ఉండాలి నీ తోడుగా..!! (ఫోటో: బి.శివప్రసాద్, సంగారెడ్డి)
36 / 44
కుమ్మరి చట్రం తిప్పుతున్న ‘పవర్’మంత్రి జగదీష్ రెడ్డి..!! (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)
37 / 44
కొండా కోనల్లో.. భానుని చల్లని చూపుల్లో నమస్తే నమస్తే..!! (ఫోటో: కొల్లోజు శివ, యాదాద్రి భువనగిరి)
38 / 44
జలకాలాట కాదు.. కృష్ణా గర్భాన గుర్రపు డెక్కల తొలగింపు..! (ఫోటో: చక్రపాణి, విజయవాడ)
39 / 44
అక్కడ పనికిరాని పచ్చదనం.. ! ఇక్కడ జీవం పోతున్న పచ్చితనం..! (ఫోటో: కిశోర్, విజయవాడ)
40 / 44
ఎండ ఎంతలా మండుతోందంటే..! ఎండమావులకే మాడు పగిలేంత..!! (ఫోటో: మనువిశాల్, విజయవాడ)
41 / 44
అల్లాహ్ దీవెనల రంజాన్ పండుగ. చిన్నారి చేతల్లో భక్తి నిండుగ..!! (ఫోటో: మనువిశాల్, విజయవాడ)
42 / 44
అటు నీలి రంగుల నీటి పొంగు. ఇటు వెండితెరల కెమెరా కన్ను..!! (ఫోటో: మోహన్‌రావు, విశాఖపట్నం)
43 / 44
కొంగొత్త రంగుల్లో హొయలు పోతున్న నగరం..!! (ఫోటో: సత్యనారాయణమూర్తి, విజనగరం)
44 / 44
పసి హృదయం యోగాకు జై అంది. మరువక ఆచరిస్తే మనకే మంచిదండీ..!! (ఫోటో: వనపర్తి, యాదిరెడ్డి)