21వ వారం మేటి చిత్రాలు
26 May, 2018 21:08 IST
1 / 39
వాళ్లు బాలలా..కార్మికులా..!! ‘పచ్చ’ నేతలకే తెలియాలి..! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)
2 / 39
మీ కళాభినయాన్ని దర్శించాలంటే చాలవు.. రెండు కనులు..!! (ఫోటో: వేణుగోపాల్, జనగాం)
3 / 39
సూర్య ప్రతాపం.. శునక విలాపం.. అక్క కరుణా ప్రసాదం..!! (ఫోటో: వీరేశ్, అనంతపురం)
4 / 39
చినుకు కురిస్తే.. చిరు జల్లు పలకరిస్తే.. మురికి నీరు రోడ్ల వెంట పరుగు పెట్టాల్సిందే..!! (ఫోటో: కె.రమేశ్‌బాబు, హైదరాబాద్)
5 / 39
వెంకన్న సన్నిధిలో కుటుంబ సమేతంగా సీనీ నటుడు అర్జున్..!! (ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుమల)
6 / 39
నో అంటే.. నో..!! నో పార్కింగ్‌లో బండి పెడితే పట్టుపడతారు..!! (ఫోటో:విజయకృష్ణ, అమరావతి)
7 / 39
హే మ్యాన్..! ప్రమాదం ‘మ్యాన్ హోల్’ రూపంలో ఉందేమో..జాగ్రత్త..!! (ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్)
8 / 39
ఎన్టీఆర్ తనయుడితో.. కేటీఆర్ సరదా సంభాషణ..!! (ఫోటో: దయాకర్, హైదరాబాద్)
9 / 39
లివింగ్స్టట్లో ఉన్నారు..! దానికి భారం పెంచారో మిమ్మల్ని ముంచేత్తది జాగ్రత్త..!! (ఫోటో:విజయకృష్ణ, అమరావతి)
10 / 39
వెచ్చని అమ్మ ప్రేమ తోడుండగా..చన్నీటితో గుబులేలరా చిన్నోడా..!! (ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్)
11 / 39
ఎత్తు ఎంతైనా ఎగిరేస్తా..ఫౌల్ కాకాండా దూకేస్తా..!! (ఫోటో: ఎం.భాషా, అనంతపురం)
12 / 39
చిరు జల్లుల వేళ.. పక్షుల వేసవి ఆనంద హేళ..!! (ఫోటో: ఎం.భాషా, అనంతపురం)
13 / 39
ఒంటి కాలుపై.. చేపల వేటలో కొంగ దొంగ జపం..!! (ఫోటో: వీరేశ్, అనంతపురం)
14 / 39
బంతి ‘పై చేయి’సాధించి..వలలో పడేసే మొనగాడెవరో..!! (ఫోటో: మురళి, చిత్తూరు)
15 / 39
హెల్మెట్ ఉంటే సరి..! మరో ముగ్గురిని ఎక్కించినా డోంట్ వర్రీ..!! (ఫోటో: ఎంవీ.రమణ, గుంటూరు)
16 / 39
దేవుడు చేశాడు దత్తన్నకు చేటు..! కొడుకు మరణం ఆయనకు తీరని లోటు..!! (ఫోటో: ఎం.రవికుమార్, హైదరాబాద్)
17 / 39
కుళాయితో కుండ నిండాలంటే.. ‘క్యూ’ తప్పనిసరి..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
18 / 39
చెట్లు పచ్చగా ఉంటే ప్రమాదాన్ని పరిచయం చేసేవే..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
19 / 39
ఫ్యాషన్ షోలో గుబాళించిన ‘కామ్నా’ గులాబీ అందం..!! (ఫోటో:ఎస్ఎస్.టాకూర్, హైదరాబాద్)
20 / 39
నెలవంక తొంగి చూసింది.. అల్లాహ్ దీవెనల రంజాను మొదలైంది..! (ఫోటో: రజ్వా దశరథ్)
21 / 39
చచ్చే ఎండల్లో బతికించే నేస్తమా..దాహం తీర్చి ప్రాణాలు నిలిపిన దైవమా..!! (ఫోటో: హుస్సేన్, కర్నూలు)
22 / 39
అమ్మో..! ఇది కూరగాయల బేరం. కొసర కూడదు..!! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)
23 / 39
అగుడున మట్టిని తెచ్చేస్తా.. ఆనందాన్ని జుర్రేస్తా..!! (ఫోటో: భాస్కరా చారి, మహబూబ్ నగర్)
24 / 39
బాల గోపాలుడి లీలలు కనరే.. ముద్దు మురిపాల నవ్వులు వినరే..!! (ఫోటో:నరసయ్య, మంచిర్యాల)
25 / 39
వేసవి తెచ్చిన ఆహ్లాదం.. పిల్లల మోముల్లో ఆనందం..!! (ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ)
26 / 39
ఓ పక్క పెట్టుబడికి సాయమిచ్చే ‘చెక్కు’ మరోపక్క..కొత్త పాసుబుక్కు..!! (ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ)
27 / 39
బోనమెత్తిన బంగారు బొమ్మ..!! (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
28 / 39
ప్రయాణీకుల ప్రాణాలను నదిలో కలిపి ‘క్షేమంగా’ ఒడ్డుకు చేరిన లాంచీ..!! (ఫోటో: గరగ ప్రసాద్, రాజమండ్రి)
29 / 39
పూవుల వెనక దాగున్న ప్రజారోగ్య దాయిని.. సిద్దిపేట ప్రజల వరదాయిని..!! (ఫోటో: కె.సతీష్, సిద్దిపేట)
30 / 39
బ్యాం‘క్యూ’లో రైతుబంధు చెక్కుల గ్రహీతల కష్టాలు..!! (ఫోటో: బి.శివప్రసాద్, సంగారెడ్డి)
31 / 39
కొమ్ములు చిన్నవైనా.. కుమ్ములాటకు వెనకాడేది లేదు..!! (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)
32 / 39
కోడిని బలిస్తున్నా.. కోరిన కోర్కెలు తీర్చు తల్లి..!! (ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి)
33 / 39
నిఘా వైఫల్యం.. చిరిగిన జాతి ప్రతీకకు చికిత్స అత్యవసరం..(ఫోటో:చక్రపాణి, విజయవాడ)
34 / 39
వస్త్రపు పోగులు కాదు.. రంజాన్ మాసపు నోరూరించే సేమియాలు..!! (ఫోటో:చక్రపాణి, విజయవాడ)
35 / 39
నీ గుడి ప్రాంగణంలో రక్షణ కరువైంది. దుర్గమ్మా.. రక్షమాం..!! (ఫోటో: కిశోర్, విజయవాడ)
36 / 39
నిరసిస్తే.. నిర్బంధించే యత్నమా..!! (ఫోటో: ఎండీ నవాజ్, విశాఖపట్నం)
37 / 39
కనికట్టు కాదు.. కావాలంటే కనిపెట్టు..! బుసలు కొట్టే పాముని చేబట్టు..!! (ఫోటో: ఎండీ నవాజ్, విశాఖపట్నం)
38 / 39
జన హృదయ నేతకు క్షీరాభిషేకం..!! (ఫోటో: సత్య నారాయణ, విజయనగరం)
39 / 39
భువనగిరి మినీ మహానాడులో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..!! (ఫోటో: కొల్లాజు శివ, యాదాద్రి)