టాప్ స్టోరీస్
వీడియోలు
Advertisement
ఈ వారం మీ ప్రేమ జాతకం

(తేదీ : 20 నుంచి 26 వరకు)

అనుకున్న ఇష్టులైన వారికి సందేశాలు అందించేందుకు శుక్ర, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలు అవతలివారు వినమ్రంగా స్వీకరించే వీలుంటుంది. ఇక ఈ సమయంలో మీరు ఆరెంజ్, రెడ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది.

మీమనస్సులో ఉన్న వారికి ప్రేమసందేశాలు అందించేందుకు సోమ, బుధవారాలు అనుకూలమైనవిగా చెప్పొచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఎల్లో, పింక్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శని, మంగళవారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమించండి.

మీరు అత్యంత ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను శుక్ర, బుధవారాలు వెల్లడిస్తే అనుకూలత ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రతిపాదనలను అవతలి వారు సైతం అంగీకరించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి ఉత్తరఈశాన్యదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, ఆది, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

మరిన్ని వివరాల కోసం... »
Tell your Wish
Test