దెబ్బకు ఠా.. ఐస్‌క్రీమ్‌ తూటా!

5 Dec, 2020 19:50 IST|Sakshi

ఓ పోలీసు అధికారి చేతిలో ఐస్‌క్రీమ్‌ ​కోన్‌తో దొంగలను తరిమికొట్టినట్లు ఉన్న ఒక వీడియో ఇటీవల నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఉరుగ్వేలోని ఓ ఐస్‌క్రీమ్‌ షాప్‌లో ఆఫ్‌ డ్యూటీ పోలీసు అధికారి తన కొడుకుతో కలిసి ఐస్‌క్రీమ్‌ తింటున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడకు వచ్చి వారి టేబుల్ వద్ద కూర్చున్నారు. వారిలో ఒకడు తన జేబులో చెయ్యిపెట్టి దేనికోసమో వెదుకుతున్నాడు.  ఈ విషయాన్ని గమనించిన ఆ పోలీస్‌ వెంటనే అప్రమత్తమయ్యి  తుపాకీతో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఇంత చేస్తున్నా మరో చేతిలోని ఐస్‌క్రీమ్‌ను వదలక పోవడంతో ఈ వీడియో తెగ వైరలయ్యింది‌. 

సయాగో పరిసర ప్రాంతంలో రాత్రి 11.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై రావడాన్ని గమనించానని, ఇది దోపిడి కావచ్చని అనుమానం రావడంతో  తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీస్‌ అధికారి  సుబ్రాయాడో తెలిపారు. కాల్పులు తరువాత దొంగలు ఇద్దరూ మోటారు సైకిల్‌ వదిలి పారిపోయారన్నారు. అయితే, వారిలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో కొద్దిదూరంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. గాయపడిన అతడిని హాస్పటల్‌కు తరలించామని,  ఛాతీకి తగిలిన బుల్లెట్‌ను వైద్యులు తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సుబ్రాయాడో తెలిపారు. చికిత్స పొందుతున్న స్నేహితుడిని చూసేందుకు వచ్చిన సహచరుడిని కూడా అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా