క్లుప్తంగా

15 Sep, 2023 07:02 IST|Sakshi

రేపు జిల్లా, జోనల్‌ స్థాయి రెజ్లింగ్‌ సెలక్షన్స్‌

నిర్మల్‌రూరల్‌: ఎస్‌జీఎఫ్‌ జిల్లా, జోనల్‌ స్థా యి (ఉమ్మడి ఆదిలాబాద్‌) అండర్‌ 14, 17 సెలక్షన్లు శనివారం భైంసా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీఈవో రవీందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. భైంసాలోని వేదం తపోవన్‌ స్కూల్‌లో ఎంపిక పోటీలు ని ర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం నిర్వహణ కార్యదర్శి నఫీఖాన్‌ను సెల్‌ నం.9440957385లో సంప్రదించాలని సూచించారు.

గుడుంబా పట్టివేత

కడెం: మండలంలోని చిట్యాల్‌, లక్ష్మీసాగర్‌లో గుడుంబా స్థావరాలపై గురువారం దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్‌ ఎస్సై రాయబారపు రవికుమార్‌ తెలిపారు. ఈదాడుల్లో 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలోనూ పట్టుబడిన షేక్‌ సల్మా, బానా వత్‌ గంగుబాయిలను తహసీల్దార్‌ రాజేశ్వరి ఎదుట బైండోవర్‌ చేశారు. ఇందులో ఎకై ్సజ్‌ సిబ్బంది రశీద్‌ఖాన్‌, గౌతం, భాస్కర్‌, హరిశ్‌, కల్పన ఉన్నారు.

మరిన్ని వార్తలు