ఆర్టీసీ డిపోలో బతుకమ్మ సంబురాలు

21 Oct, 2023 01:58 IST|Sakshi
బతుకమ్మ ఆడుతున్న మహిళ కండక్టర్లు

నిర్మల్‌టౌన్‌: నిర్మల్‌ ఆర్టీసీ డిపోలో గురువారం రాత్రి బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళా కండక్టర్లు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, పూజించారు. డీజే పాటల మధ్య కోలాటం ఆడారు. అనంతరం ఊరేగింపుగా బంగల్‌పేట్‌ వినాయక సాగర్‌ వరకు వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. డిపోలో బతుకమ్మను నెలకొల్పి పండుగ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని డిపో మేనేజర్‌ ప్రతిమారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్లు రాజశేఖర్‌, శ్రీకర్‌, మహిళా కండక్టర్లు, డ్రైవర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.

వృద్ధుడి మృతదేహం లభ్యం

ఎదులాపురం: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు టూటౌన్‌ పోలీసులు తెలిపారు. వృద్ధుడి వయస్సు 60 నుంచి 65 మధ్య ఉంటుందని, దోతి, ఫుల్‌ షర్ట్‌ ధరించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు