చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతర తనిఖీలు

15 Nov, 2023 01:50 IST|Sakshi
వాహనాల తనిఖీని పరిశీలిస్తున్న ఎస్పీ
● ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

జైనథ్‌: అంతర్రాష్ట్రీయ, అంతర్‌ జిల్లా చెక్‌పోస్ట్‌ల వద్ద 24 గంటల పాటు పకడ్బందీ తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. డబ్బు, మద్యం, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా చెక్‌పోస్ట్‌ల వద్ద ఇప్పటి వరకు రూ.1.35కోట్ల నగదు, 71 కిలోల గంజాయి, 12.08 లక్షల విలువ చేసే 1826. 9 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. మొత్తం 796 కేసుల్లో 1292మంది బైండోవర్‌ చేసినట్లు చెప్పారు. ఆయన వెంట జైనథ్‌ సీఐ నరేశ్‌కుమార్‌, ఎస్సై పురుషోత్తం, తదితరులున్నారు.

మరిన్ని వార్తలు