‘కేసీఆర్‌ నాయకత్వం దేశానికి అవసరం’

15 Nov, 2023 01:50 IST|Sakshi
మాట్లాడుతున్న శంకర్‌ దోడ్గే

ఆదిలాబాద్‌టౌన్‌: సీఎం కేసీఆర్‌ వంటి సమర్థవంత నాయకుడు దేశానికి అవసరమని మహా రాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, నాందేడ్‌ మాజీ ఎమ్మె ల్యే శంకర్‌ దోడ్గే అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లలోనే తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీలు పాలించిన మ హారాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ వంటి సమర్థవంతమైన నాయకుడిని పాలనలో తెలంగాణ అభివృద్ధి సాధించిందని చెప్పారు. దేశంలో ఎక్కడలేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని పే ర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ ప్రేమేందర్‌, పార్టీ నాయకులు సతీశ్‌, కస్తాల ప్రేమల, యూనుస్‌ అక్బాని, సుకన్య, సలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు