ఖైదీలు న్యాయసాయం పొందవచ్చు

15 Nov, 2023 01:50 IST|Sakshi
కౌన్సిల్‌ సభ్యులతో కలిసి జిల్లా జైలును సందర్శిస్తున్న క్షమాదేశ్‌పాండే

ఆదిలాబాద్‌టౌన్‌: ఖైదీలు లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కౌన్సిల్‌ ద్వారా ఉచిత న్యాయ సాయం పొందవచ్చని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే అన్నారు. జిల్లా కేంద్రంలోని జైలును లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సి ల్‌ సభ్యులతో కలిసి మంళవారం సందర్శించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఖైదీ లు ఏదైనా కేసులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు వారి ఆర్థిక స్థితి, అక్షరాస్యత ఆధారంగా వివక్ష చూపకూడదని పేర్కొన్నా రు. కొన్ని కఠినమైన షరతులను సడలించడానికి లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ పని చేస్తుందన్నారు. ప్రతిఖైదీ న్యాయ సేవలు పొం దేందు కు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్‌ సభ్యులు అశోక్‌, ఉమేష్‌రావు, జైలు సూపరింటెండెంట్‌ అశోక్‌కుమార్‌, జైలర్లు మధు, కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు