ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం చేయాలి

16 Nov, 2023 06:20 IST|Sakshi
ఆదిలాబాద్‌లో సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జోగు రామన్న
● ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే రామన్న

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా కేంద్రంలోని డైట్‌ మైదానంలో గురువారం సీఎం కేసీఆర్‌ పాల్గొననున్న ప్రజాశీర్వాద సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి సభ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సభకు జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కేసీఆర్‌ సభ ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. ఎమ్మెల్యే వెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు అజయ్‌, సంద నర్సింగ్‌, భరత్‌, అశోక్‌ స్వామి, ఇమ్రాన్‌, రాజు, నాయకులు రవికుమార్‌, శేఖర్‌, శ్రీనివాస్‌రావు, సాజిదొద్దీన్‌ తదితరులున్నారు.

ఇచ్చోడలో ఏర్పాట్లు పరిశీలన..

ఇచ్చోడ: ఇచ్చోడలో నేడు నిర్వహించనున్న ప్రజా ఆశ్వీరాద సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ బోథ్‌ అసెంబ్లీ అభ్యర్థి అనిల్‌జాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలోని నిర్మల్‌ బైపాస్‌ వద్ద నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లను ఇన్‌చార్జి గొడం నగేశ్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. పార్టీకి నియోజకవర్గంలో 60వేల మంది కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. వారంతా స్వచ్ఛందంగా సభకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీపీ ప్రీతంరెడ్డి, మండల కన్వీనర్‌ కృష్ణారెడ్డి, నాయకులు సుభాష్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు