ఆటోబోల్తా పడి వృద్ధురాలి మృతి

18 Nov, 2023 01:50 IST|Sakshi
లింగుబాయి (ఫైల్‌)

నార్నూర్‌: గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం వద్ద ఆటో బోల్తాపడిన ఘటనలో వృద్ధురాలి మృతిచెందగా, పలువురి గాయాలయ్యాయి. ఎస్సై మహేశ్‌ కథనం ప్రకారం.. ఖడ్కి గ్రామానికి చెందిన ఉయక లింగుబాయి (60) అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా విధులు నిర్వహిస్తోంది. శుక్రవారం ఐసీడీఎస్‌ పని మీద లోకారి గ్రామానికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుంది. ఖడ్కి వద్ద ఆకస్మాత్తుగా ఎద్దు రావడంతో ఆటోబోల్తా పడింది. ఈ ప్రమాదంరలో లింగుబాయి అక్కడిక్కడే మృతిచెందింది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు