చాలెంజ్‌ ఓటు అంటే..?

18 Nov, 2023 01:50 IST|Sakshi
మీకు తెలుసా?

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ‘చాలెంజ్‌ ఓటు’ (సవాల్‌ ఓటు) అనేది ఒకటి ఉంది అనేది మీకు తెలుసా?.. ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావితం చేసే ‘చాలెంజ్‌ ఓటు’ అంటే ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఓటరు జాబితాలో పేరున్నా.. ఓటు వేసేందుకు అనర్హుడని రాజకీయ పార్టీల ఏజెంట్లు సవాల్‌ చేయడాన్ని చాలెంజ్‌ ఓటు అంటారు. పోలింగ్‌ కేంద్రంలో కొంతమంది ఏజెంట్లు ఆ వ్యక్తి బోగస్‌ అని పోలింగ్‌ అధికారికి తెలియజేస్తారు. సదరు అధికారి ఫిర్యాదును పరిశీలించి ఏజెంట్‌ నుంచి రూ.5 ఫీజు తీసుకుని రసీదు ఇస్తారు. స్థానిక సిబ్బందితో ప్రాథమిక విచారణ జరిపిస్తారు. కాగా, ఓటరు జాబితాలో అతడి పేరు, ఫొటో ఇతర వివరాలు సక్రమంగా ఉంటే ఓటు వేసేందుకు అర్హుడని తేలితే ఎన్నికల అధికారులు అనుమతిస్తారు. బోగస్‌ అని తేలితే మాత్రం అధికారులు అతడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తారు.

మరిన్ని వార్తలు