వివాహానికై వ‌చ్చి ఆర్మీ జవాన్‌ తీవ్ర నిర్ణ‌యం! అస‌లు కార‌ణాలేంటి?

25 Dec, 2023 08:10 IST|Sakshi
గడ్‌ చందా రమేష్‌ (ఫైల్‌)

నిర్మల్‌: ఆర్మీ జవాన్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్‌లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో విషాదం నెలకొంది. పట్టణ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ వివరాల ప్రకారం.. స్థానిక వెంకటాపూర్‌ కాలనీకి చెందిన గడ్‌ చందా రమేష్‌ (28) ఆర్మీ జవాన్‌. కోల్‌కత్తా బార్డర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్‌ 15న తన బామ్మర్ది వివాహం నాగంపేట్‌ ముప్కల్‌ మండలంలో ఉండడంతో వచ్చాడు.

వేడుకలు ముగించుకొని ఆదివారం ఉదయం తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ప్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో ఇంట్లో వారు చూసేసరికి ప్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమేష్‌ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ముఖ్య గమని​క: ​ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

ఇవి చ‌ద‌వండి: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి

>
మరిన్ని వార్తలు