‘బిడ్డ బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది.. కాపాడండి’

11 Jan, 2022 14:09 IST|Sakshi

పొద్దున అనగా తినకుండా ఆయన బయటకు వెళ్లాడు. ఎర్రటి ఎండలో వాడిపోయిన ముఖంతో ఇంట్లో అడుగు పెట్టాడయన. నీళ్లేమైనా తాగుతావా అంటూ ఎదురెళ్లా ? నా ప్రశ్నకు బదులివ్వకుండా .. ఇంట్లో విలువైన వస్తువులేమి ఉన్నాయంటూ అడిగాడు. నా మెడలో తాళి బొట్టు తప్ప ఏం లేవని బదులిచ్చా. అది కాకుండా ఏమీ లేవా అంటూ మరోసారి అడిగాడు. లేవంటూనే చెప్పాను... చివరకు కనీసం నీళ్లయినా తాగకుండా మెడలో తాళి బొట్టు తీసుకుని బటయకు వెళ్లాడాయన.. ఈ ఒక్క రోజే కాదు ఆ విషయం తెలిసన మరుక్షణం నుంచి మా ఇంట్లో నుంచి సంతోషం బటయకు వెళ్లింది. బాధ, ఏడుపు, నిరాశలే ఇక్కడ గూడు కట్టుకున్నాయి. 

హేమంత్‌ మా కలల పంట. వాడు పుట్టినప్పటి నుంచి మా ఇళ్లు చీకు చింతా లేకుండా గడిచిపోతుంది. కరోనా కావడంతో స్కూల్ కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు. వాడి అల్లరి పనులతో ఇల్లంతా సందడిగా ఉండేది. కానీ రెండు నెలల క్రితం బిడ్డకి జ్వరం వచ్చింది. ఒళ్లంతా కాలిపోతుంది. ఒంట్లో ఎముకలన్నీ మెలి పెడుతున్న బాధతో విలవిలాడిపోతున్నాడు కొడుకు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాం. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

మా ఊరిలో హేమంత్‌ని పరిశీలించిన డాక్టర్లు జ్వరానికి మాత్రలు ఇచ్చారు. కానీ బాబుకు వచ్చిన సమస్య ఏంటో తమకు అర్థం కావట్లేదన్నారు.  చెన్నై వెళ్లి పెద్దాసుపత్రిలో చూపించాలన్నారు. మరునాడే చెన్నై బస్సెక్కాం. ఉదయం నుంచి పరీక్ష వెనుక పరీక్షలు చేస్తున్నారు ఆస్పత్రిలో. సూదులతో గుచ్చి రక్తం శాంపిల్స్‌ తీసుకుంటున్నారు. బిడ్డ బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏ దారుణమైన నిజం వినాల్సి వస్తుందో అని క్షణక్షణం ఆందోళనలతో నిండిపోయింది మనసు.

కాళ్లు వణుకుతుండగానే డాక్టరు గదిలోకి వెళ్లాం. హేమంత్‌ రిపోర్టులు చేతిలో పట్టుకున్న డాక్టరు మా వైపు తిరిగాడు.. ‘మీ బాబుకి బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉంది. వైద్య పరిభాషలో మెడుల్లోబ్లాస్టోమా అంటారు. అతనికి ఈ క్షణం నుంచే రేడియేషన్‌ చికిత్స అందివ్వాలి, రక్తమార్పిడి చేయాలి వీటికి తగ్గట్టు సపోర్టివ్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం’ అని చెప్పారు. ఆయన ఒక్కో మాటకు మా ఇద్దరి గుండెలు ముక్కలయ్యాయి. దేవుడా నా కొడుక్కి ఎందుకింత కష్టం ఇచ్చావ్‌ అనుకుంటూ ఇంటికి వచ్చాం.

హేమంత్‌ తిరిగి ఆరోగ్యవంతుడు అవ్వాలంటే డాక్టరు చెప్పినట్టుగా చికిత్స అందివ్వాలి. దానికి రూ.10 లక్షల ఖర్చు వస్తుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ అమ్మి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఆఖరికి మెడలో మంగళ సూత్రం కూడా అమ్మేశాను.  నా భర్త ఆటో డ్రైవరుగా పని చేస్తాడు. ఆయన సంపద మూడు పూటలా తిండికే సరిపోతుంది. పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేది ?

బ్రెయిన్‌ ట్యూమర్‌ పెడుతున్న ఇబ్బందులో బిడ్డ పడే యాతన చూస్తూంటే కన్నీళ్లు ఆగడం లేదు. పది లక్షల రూపాయలు సమకూర్చలేని మా అసమర్థత వల్ల చిన్నారి హేమంత్‌ ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఈ తరుణంలో మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టో గురించి తెలిసింది. మా హేమంత్‌ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. మీరు చేసే సాయం ఓ నిండు ప్రాణాలను కాపాడుతుంది. (అడ్వెటోరియల్‌)

>
మరిన్ని వార్తలు