రూ.99కే ‘కాల్కస్‌ ఇండియా’ ఎగ్జామ్‌‌ ప్రిపరేషన్‌ యాప్

1 Mar, 2021 19:11 IST|Sakshi

ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కొంత కష్టమైన పని అని చెప్పాలి. ఆన్‌లైన్‌ క్లాసులు విన్న తర్వాత వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చెయాలంటే విడిగా అనేకరకాల సీడీ మెటీరియల్స్‌ను కొనుక్కోవాలి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కాల్కస్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘కాల్కస్‌ ఇండియా ఎగ్జామ్‌‌ ప్రిపరేషన్‌ యాప్‌’ను విడుదల చేసింది.

ఇందులో పాఠశాల స్థాయి నుంచి సివిల్స్‌ ఎంట్రెన్స్‌ స్థాయి వరకు పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్‌లు, చాప్టర్‌వైస్‌ టెస్ట్‌లు, గత పరీక్షల పశ్న పత్రాలు, లేటెస్ట్‌ నమూనా ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యాప్‌లో మొత్తం 1324 విభాగాల్లో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లతో కూడిన 25 బండిళ్లను అందుబాటులో ఉంచామని ‘కాల్కస్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్’‌ వ్యవస్థాపకురాలు వాణీకుమారి తెలిపారు.

1324 విభాగాలతో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్‌లు
కాల్కస్‌ ఇండియా యాప్‌లో అన్ని రకాల పోటీ పరీక్షలను పొందుపరిచారు. ఇందులో సీబీఎస్‌సీ, ఐసీఎస్‌సీ, కేవీపీవై,ఎన్‌సీఓ,ఎంటీఎస్‌సీ, హెచ్‌బీబీవీఎస్‌, సైనిక్‌ స్కూల్‌ ఎంట్రెన్స్‌, జవహార్‌ నవోదయ ఎంట్రెన్స్‌, ఎస్‌ఓఎఫ్‌ ఇంగ్లీష్‌ ఒలంపియాడ్‌, సైన్స్‌ ఒలంపియాడ్‌ ఫౌండేషన్, నేషనల్‌ సైన్స్‌ ఒలంపియాడ్‌ వంటి పరీక్షలే కాకుండా ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఎంసెట్‌, రైల్వే, పోలీసు, డిఫెన్స్‌, మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌, టీచింగ్‌, ప్రభుత్వ, యూపీఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, టెట్‌, స్కిల్స్‌, ఎపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, సివిల్స్‌ ఎంట్రెన్స్‌ వంటి మరిన్ని1324 రకాల పోటీ పరీక్షలు ఈ యాప్‌లో పొందుపరిచినట్లు సంస్థ వ్యవస్థాసకురాలు వాణి కుమారి తెలిపారు.

తెలుగు మీడియం విద్యార్థుల కోసం..
తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం తెలుగులో కూడా ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షల నోటిఫికేషన్ల ఆధారంగా పొందుపరిచారు.

ఏడాదికి రూ.99 
ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదవుతున్నా కేవలం రూ.99తో సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే అన్ని రకాల పశ్న పత్రాలను కొనుక్కోవాలి. కానీ, ఈ యాప్‌లో ఒక బండిల్‌లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్‌స్క్రిప్షన్‌తో ఏడాదిపాటు అపరిమితంగా ప్రాక్టీసు చేసుకోవచ్చు. యాప్‌ విడుదల సందర్భంగా పరిమిత టెస్ట్‌లను ఉచితంగా అందుబాటులో ఉంచారు. రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్థులు ఉచిత ప్రాకీస్టు చేసి ఇంకా కావాలనుకుంటే రూ. 99తో సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. 

అందరికీ విద్య- అందుబాటు ధరలో!
‘‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’’ అనే లక్ష్యంతో రూ.99కే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్‌ ఇండియా అని, అతి తక్కువ ధరలో అందించే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాణీకుమారి తెలిపారు. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌లో ‘calcusindia’అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.calcusindia.comను సందర్శించండి లేదా 9133607607కి ఫోన్‌ చేయవచ్చు.

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు