పసిబిడ్డ ప్రాణాలకి శాపంగా మారిన పేదరికం

11 Oct, 2021 16:22 IST|Sakshi

రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం నూరి, ఫరూఖ్‌ అహ్మదిలది. పెళ్లై చాన్నాళ్లవుతున్నా పిల్లలు లేరనే బాధ వాళ్లని వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు కరోనా రూపంలో వచ్చిన లాక్‌డౌన్‌ వాళ్లని మరింతగా కుంగదీసింది. ఈ కష్టాల సమయంలో అల్లా దయ చూపినట్టుగా నెల తప్పింది నూరి. 

పుట్టబోయే బిడ్డ కోసం, అతని బోసి నవ్వుల కోసం ఎదురు చూశారు ఆ దంపతులు. ఆ రోజు రానే వచ్చింది. పురిటి నొప్పులు మొదలవడంతో నూరిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఫరూఖ్‌ అహ్మద్‌. పంటి బిగువన బాధను భరిస్తూ బిడ్డకు జన్మనిచ్చింది నూరి.

ఆస్పత్రిలో నూరి కళ్లు తెరిచి చూసే సరికి నా పక్కన ఉండాల్సిన పసి పిల్లాడు కనిపించలేదు. కానీ,   బెడ్‌ పక్కనే ఆందోళనతో ఉన్న నర్సులు కనిపించారు. ఏమైందని వాళ్లని నిలదీస్తే... ‘ మీ బిడ్డ చాలా బలహీనంగా ఉన్నాడు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఎన్‌ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాం. మీ బిడ్డను, మిమ్మల్నీ ఇప్పుడే డిస్‌ఛార్జ్‌ చేయలేం’ అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టరు జరిగిందంతా నూరికి వివరించింది చెప్పింది.
సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

ఒకటి, రెండు, మూడు... రోజులు గడుస్తున్నా బిడ్డ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. ఆస్పత్రి ఖర్చుల కోసం అందినకాడికల్లా అప్పులు చేశారు నూరి,ఫరూఖ్‌లు. బిడ్డ నార్మల్‌గా కావాలంటే రోజుల తరబడి ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందివ్వాలని డాక్టర్లు చెప్పారు. దాని కోసం రూ. 18 లక్షల ఖర్చు వస్తుందన్నారు.
సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

ఫరూఖ్‌ పొద్దంతా కష్టపడితేనే రూ. 250 సంపాదించడం కష్టం. అలాంటిది రూ. 18 లక్షలు ఎక్కడి నుంచి తేగలరు ఆ దంపతులు. అలాగని ఊపిరి తీసుకునేందుకు ఆపసోపాలు పడుతున్న పసిబిడ్డను చూస్తూ ఊరుకోలేరు. తమ పేదరికమే పసిబిడ్డ పాలిట శాపమైందంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సమయంలో మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టో సంస్థ ముందుకు వచ్చింది. నూరి, ఫరూఖ్‌ల బిడ్డను ఆదుకునేందుకు సాయం చేయండి. 
సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి


 

మరిన్ని వార్తలు