యమున కన్నీరు ఆగేనా? బోసి నవ్వులు విరిసేనా?

22 Oct, 2021 16:11 IST|Sakshi

యమునా, మోహన్‌లది అన్యోన్య దాంపత్యం. ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా ఆ జంట సంతోషంగానే జీవిస్తున్నారు.  అయితే వారికి ఉన్న ఒకే ఒక్క లోటు సంతానం. గతంలో యమునా ఓసారి ప్రసవించినా.. ఈ బిడ్డకు నూరేళ్లు నిండకుండానే దేవుడు తీసుకెళ్లిపోయారు. చాన్నాళ్ల తర్వాత యమున మరోసారి నెల తప్పింది. మరి వాళ్లింట్లో బోసి నవ్వులు వినిపించాయా ?

పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో యుమనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. భరించలేని నొప్పిని పంటి బిగువన భరిస్తూనే ఉంది యమున. కాసేపటికి నర్సుల వచ్చి ‘నీకు డబుల్‌ కంగ్రాట్స్‌’ అని చెప్పారు. కవలలు పుట్టారని, వాళ్లలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అంటూ తీపి కబురు అందించారు. పిల్లలు లేరంటూ ఇన్నాళ్లు పడుతున్న వేదనంతా ఒక్కసారిగా దూదిపింజంలా ఎగిరిపోయినట్టు అనిపించింది యమనకి.

గంటల గడుస్తున్న డాక్టర్లు పసి బిడ్డలను నాకు చూపించడం లేదు. ఏమైందంటూ నర్సులను అడిగితే ‘ నెలలలు నిండకుండానే ప్రసవం జరగం వల్ల ఇద్దరి ఆరోగ్యం బాగా లేదని, ఎన్‌ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని చెప్పారు. కానీ నెల రోజుల తర్వాత యమున గుండె బద్దలయ్యే వార్త డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడక పోడంతో మగ శిశువు మరణించాడని తెలిపారు. అంతేకాదు ఆడ శిశువు సైతం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతోందంటూ చెప్పారు.

నెల రోజుల వయస్సున్న చిన్నారి శరరీం నిండా వైద్య పరికరాలే అమర్చి ఉన్నాయి. ఊపిరి తీసుకునేందుకు బిడ్డ అవస్థలు పడుతోంది. 12 వారాల పాటు చికిత్స అందిస్తే బిడ్డ ప్రాణాలు నిలబడతాయని డాక్టర్లు చెప్పారు. దాని కోసం రూ. 6 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. కానీ అప్పటికే రెండు నెలలుగా ఆస్పత్రికి అయిన ఖర్చులతో మోహన్‌, యమునల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోయాయి. దీంతో కన్నీరు కార్చడం తప్ప యమునకు మరో దారి లేని స్థితిలో ఉండిపోయింది.

వైద్యానికి చేతిలో చిల్లగవ్వ లేని పరిస్థితు​​‍ల్లో  కొండంత వేదనలో యుమన, మోహన్‌లు ఉండగా వారికి మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టో గురించి తెలిసింది. యమున మోహన్‌ల బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వగలరు. 


సాయం చేయాలంటే ఇక్కడ ప్రెస్‌ చేయండి

మరిన్ని వార్తలు