‘పై’ ఎలక్ట్రానిక్స్‌ లక్కీడ్రాలో బహుమతుల బొనాంజా

31 Mar, 2022 14:43 IST|Sakshi

గత ఏడాది డిసెంబర్‌ 5న ప్రముఖ రిటైల్‌ దిగ్గజం పై ఇంటర్నేషన్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(Pai International Electronics Ltd) నిర్వహించిన మెగా ఫెస్టివల్‌ సేల్‌ లక్కీ డ్రాలో హైదరాబాద్‌కు చెందిన బాబీ అనే వ్యక్తి  మెర్సిడెజ్‌ బెంజ్‌ జీఎల్‌ఏ కారును గెలుచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను పై సంస్థ యూట్యూబ్‌లో ప్రసారం చేసింది.  2021 గాను దసరా, దీపావళి నేపథ్యంలో రూ. 2 వేలు కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులను  కొనుగోలు చేసే వారికి డిజిటల్‌ కూపన్లను పై ఇంటర్నేషనల్‌ అందించింది. ఈ సేల్‌లో బాబీ రూ. 8000 విలువైన సేల్‌ ఫోన్‌ను కొనుగోలు చేసి కారును గెల్చుకున్నాడు.  

కస్టమర్ల కోసం ప్రతియేడాది నాలుగు సార్లు, ప్రతి పండుగ సీజన్‌లో లక్కీ విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. గత 20 సంవత్సరాలలో,..320 కార్లు, 320 బైక్‌లు, రూ. 22.5 కోట్ల విలువైన ఉచిత షాపింగ్, రూ. 7.3 కోట్ల గోల్డ్‌ రివార్డ్‌, రూ. 2.65 కోట్ల విలువైన నగదు బహుమతులు, అలాగే 64.56 కోట్ల విలువైన పై లాయల్టీ పాయింట్లను అందించింది.

Pai International Electronics Ltd రిటైల్‌ సంస్థ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నీచర్ కోసం ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌గా నిలుస్తోంది. కస్టమర్ల కోసం అనేక రకాల సేల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాకుండా కస్టమర్లకు అదనంగా లక్కీడ్రాలు, బహుమతులను ఉచితంగా అందిస్తోంది. పండుగ సీజన్‌ నేపథ్యంలో కస్టమర్లు విలువైన బహుమతులను ప్రకటించింది.  వాటితో పాటుగా కస్టమర్లు 15 కోట్ల వరకు పైగా లాయల్టీ పాయింట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ ఆరా వంటి కార్లు, అలాగే ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కస్టమర్లకు అదనంగా గిఫ్ట్‌కార్డులను, రివార్డులను కూడా ప్రకటిస్తుంది.

దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణలో పై ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌  విస్తరించి ఉంది. ఇది సుమారు 87 లార్జ్‌ స్కేల్‌ మల్టీ బ్రాండ్‌ అవుట్‌లెట్లతో పాటుగా దాదాపు 121 మొబైల్ ఫోన్ అవుట్‌లెట్లతో, 15 ఫర్నిచర్‌ షాపులను కలిగి ఉంది.  కోవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా కస్టమర్లకు షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తోంది. పై ఫౌండేషన్‌ ద్వారా పలు సామాజిక సేవలను కూడా చేస్తోంది పై ఇంటర్నేషనల్‌. పర్యావరణ పరిరక్షణ నుంచి నిరుపేద వృద్ధులకు, విద్యార్థులకు తన వంతు సహాకారాన్ని అందిస్తోంది. (అడ్వటోరియల్‌)

మరిన్ని వార్తలు