లేకలేక పుట్టిన బిడ్డకి ఎంత కష్టం వచ్చింది

15 Nov, 2021 15:20 IST|Sakshi

రమ్య, ప్రశాంత్‌లది చూడచక్కని జంట. పెళ్లై చాన్నాళ్లయినా పెద్దగా గొడవలు లేవు. భార్య మనసెరిగి ప్రవర్తించే భర్త. అతని సంపాదనకు తగ్గట్టుగా ఇంటిని గుట్టుగా నడిపించే ఆమె. అయితే వారికి తీరని లోటు సంతానలేమి. గతంలో రమ్యకి రెండు సార్లు గర్భస్రావం కూడా జరగడంతో ఇక పిల్లలు పుట్టరనే నిరాశ వారిని ఆవహించింది. ఆ సమయంలో వాళ్లిద్దరికి ఓ శుభవార్త తెలిసింది.

మూడోసారి నెల తప్పింది మొదలు రమ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ప్రశాంత్‌. అడినవి, అడగనివి అన్ని ఆమె చెంతకే తీసుకొస్తున్నాడు. పుట్టబోయే బిడ్డను తలచుకుని ప్రతీ క్షణం కలలు కంటున్నారు ఆ జంట. రమ్యకి ఆరో నెల ఉండగానే పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే మగ కవలలకి జన్మనిచ్చింది రమ్య. 

నెలలు నిండకుండానే పుట్టడంతో ఇద్దరి పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా రెండో కవల పిల్లాడు కిలో కంటే తక్కువ బరువుతో పుట్టాడు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఆ బిడ్డను వెంటాడుతూనే ఉన్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి, ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రతీక్షణం అవస్థలు పడుతూనే ఉన్నాడు.


రమ్య రెండో మగ బిడ్డకి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వైరల్‌ నిమోనియా సోకినట్టుగా గుర్తించారు. అంతేకాదు అప​‍్పర్‌ లోబ్‌ కోలాప్స్‌ అయినట్టు కూడా వైద్య పరీక్షల్లో తేలింది. బాబు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, ఆస్పత్రిలో అబ్‌జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందివ్వాలన్నారు. వైద్య చికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు డాక్టర్లు.

ప్రశాంత్‌ నెలంతా కష్టపడి పని చేస్తే వచ్చే ఆదాయం రూ.10,000లు మించదు. అలాంటిది బిడ్డల వైద్య చికిత్స నిమిత్తం రూ. 25,00,000 నగదు తేవడం వారికి సాధ్యం కాని పని. ఈ సమయంలో మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టోని సంప్రదించారు. ప్రశాంతి,రమ్యల బాబు ప్రాణాలు నిలిపేందుకు మీ వంతు సాయం చేయండి.
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి


 

మరిన్ని వార్తలు