అయ్యో కార్తీక్‌ ! చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష

21 Feb, 2022 08:53 IST|Sakshi

చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు కార్తీక్‌. అవమానకరమైన ఆ శిక్షను తప్పించుకోవడానికి చిన్నప్పుడే బడి మానేశాడు, పెద్దయ్యాక పనికి వెళ్లడం కష్టంగా మారింది. చివరకు అతని జీవితమే ప్రమాదంలో పడింది. 

జన్యుపరమైన ఇబ్బందులతో పుట్టాడు కార్తీక్‌, చిన్నప్పటి నుంచే అతని ముఖంపై ట్యూమర్లు రావడం ప్రారంభమైంది. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సర్జరీల కోసం తమ శక్తికి మించి ఖర్చు చేశారు. అయినా ట్యూమర్లు రావడం ఆగలేదు. చివరకు డబ్బుల్లేక ఆ ట్యూమర్లను అలానే వదిలేయాల్సిన దుస్థితి ఎదురైంది కార్తీక్‌కి అతని కుటుంబానికి

ముఖంపై పెరిగిన ట్యూమర్లతో స్కూలుకి వెళ్లిన కార్తీక్‌ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదుర్కొలేక బడి మానేశాడు. ఆ తర్వాత అతనికి పని ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. చివరకు ఆ ట్యూమర్లు పెరిగి పెద్దవిగా మారి అతని చూపుకు ప్రమాదం తెచ్చాయి. ఎడమ కంటి నుంచి ధారాగా నీరు కారుతోంది. స్థానిక డాక్టర్లు అతన్ని పట్టించుకోవడం మానేశారు. నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు కార్తీక్‌
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

ముప్పై నాలుగేళ్లుగా చూస్తున్న దుర్భర జీవితం నుంచి కార్తీక్‌కి విముక్తి కలగాలంటే పలు సర్జరీలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆపరేషన్లకు రూ. 40 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అంత డబ్బు సర్థుబాటు చేసే స్థితిలో కార్తీక్‌ కుటుంబం లేదు. నిత్యం అవమానాలు, చీత్కరింపులు, అనారోగ్య సమస్యలతో క్షణక్షణం నరకం చూస్తున్న కార్తీక్‌కి ఇప్పుడీ ఆపరేషన్‌ ఒక్కటే దిక్కు. దీంతోనే అతను భవిష్యత్తులో అందరిలా సాధారణ జీవితం గడపగలడు. కార్తీక్‌కి చక్కని భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయగలరు. (అడ్వెటోరియల్‌)

సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి  

>
మరిన్ని వార్తలు