కళ్లెదుటే ఓ కొడుకు చనిపోయాడు.. ఇప్పుడు ప్రమాదంలో మరో బిడ్డ ప్రాణాలు

18 Jan, 2022 11:49 IST|Sakshi

మాది వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్ది పాటి భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. పెళ్లైన చాలా ఏళ్లకు ఓ బిడ్డ కలిగాడు. వాడు ఎదిగి బడికి పోతున్నప్పుడు చూస్తుంటే ముచ్చటేసేది. బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనే నమ్మకం కలిగేది. ఎప్పటిలాగే స్కూల్‌కి వెళ్లిన నా కొడుకు మళ్లీ ఇంటికి రాలేదు. బడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నా పదమూడేళ్ల బిడ్డ చనిపోయాడు.

సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

ఎదిగొస్తున్న కొడుకు కళ్ల ముందే చనిపోతే పడే బాధ మాటల్లో వర్ణించలేం. ఎటు చూసినా, ఏం చేసినా నా కొడుకే కళ్ల ముందు కదలాడేవాడు. వాడి జ్ఞాపకాలు మరిచిపోవడం కష్టమైంది మా ఇద్దరికి. అలా నిరాశలోనే గడిచిపోతున్న మా జీవితంలో.. మరోసారి నేను తల్లి కాబోతున్నాను అనే వార్త వినగానే వెలుగు నిండింది. 

నెలలు ఎప్పుడు నిండుతాయా? మరోసారి మా ఇంట్లో బోసి నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయా ? అని గంపెడాశతో ఎదురు చూస్తుండగా, ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. మాకు మరోసారి మగ బిడ్డ పుట్టాడని డాక్టర్లు చెప్పినప్పుడు ‍ కొండంత  సంతోషం కలిగింది. కానీ అది ఎక్కువ సేపు నిలవలేదు.

నెలలు నిండకుండానే పుట్టడంతో బిడ్డ ఆరోగ్యం బాగాలేదని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఎన్‌ఐసీయూ వార్డుకి తరలించారు. సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డలు 2.5 కేజీల నుంచి 4.5 కేజీలు ఉంటే నా బిడ్డ కేవలం 1.1 కేజీనే ఉన్నాడు. ఊపిరి తీసుకోవడానికే కష్టపడుతున్నాడు. వాణ్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది.

ఎన్‌ఐసీయూలో ఉన్న నా కొడుకును చూడటానికి వెళ్లినప్పుడు నా కళ్ల వెంబడి నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. కొడుకు ఒంటి నిండా సూదులు గుచ్చి ఉన్నాయి. పైపులు అమర్చి ఉన్నాయి. వాడి కంటి కొనల నుంచి నీరు కారుతోంది. ఎంత యాతన అనుభవిస్తున్నాడో బిడ్డ అనిపించింది. నా బిడ్డ ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఎన్‌ఐసీయూలో ఉంచి వైద్యం చేయాలని డాక్టర్లు చెప్పారు. మొత్తంగా రూ. 8 లక్షల ఖర్చు వస్తుందన్నారు.

ఏ ఆస్తులు లేని మాకు డాక్టర్లు చెప్పిన రూ.8 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదు. అప్పటికే బిడ్డ ఆస్పత్రికి ఖర్చులకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాం. పదమూడేళ్ల కొడుకు కళ్ల ముందే చనిపోతే వచ్చే కష్టం ఏంటో నాకు తెలుసు.. ఇ‍ప్పుడు రెండో బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నా కొడుకు కాపాడే దిక్కెవరని ఏడుస్తుంటే మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టో గురించి తెలిసింది. ఓ బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నాను. నా చిన్నారి తండ్రి ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. ఆపదలో మీరు చేసే సాయం నా బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది. వాడికి భవిష్యత‍్తును అందిస్తుంది. (అడ్వెటోరియల్‌)
 సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి

>
మరిన్ని వార్తలు