మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె

20 Aug, 2021 20:51 IST|Sakshi

రోజు మీరు ఉపయోగించే వంటనూనె మీ ఆరోగ్యానికి మంచిదేనా? మీ గుండెకు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా ? ఆరోగ్యాన్ని కాపాడుతూ గుండెకు మేలు చేయడంలో రైస్‌బ్రాన్‌ వంట నూనెలు ముందున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో  కొలెస్ట్రాల్‌  సమతుల్యత సాధించడంలో రైస్‌బ్రాన్ ఆయిల్‌ ఎంతగానో ఉపయోగపడుతోందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో పాటు అమెరికా హర్ట్‌ అసోసియేషన్‌లు ఇప్పటికే సూచించాయి.

కొలెస్ట్రాల్​ని  కంట్రోల్‌ చేస్తుంది
చుడటానికి చక్కని రంగులో కనిపించే రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ వంటకు ఎంతో బాగుంటుంది. ఇందులో నాచురల్‌ యాంటీఆక్సిడెంట్‌ అయిన ఒరిజనోల్‌ పుష్కలంగా లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించి మంచి  కొలెస్ట్రాల్​ని  పెంచుతుంది. దేశీయంగా తయారయ్యే రైస్‌బ్రాన్‌ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ వాడకం మాత్రం తక్కువగానే ఉంది. 

బియ్యపు పొట్టు నుంచి
రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ అంటే బియ్యంలోని పోషక పదార్థాల నుంచి నూనెను సేకరిస్తారనే అపోహ ఉంది. కానీ వాస్తవంలో అది నిజం కాదు. బియ్యం గింజ చుట్టూ ఉండే పొట్టు నుంచి ఆయిల్‌ని సేకరిస్తారు. ఈ బ్రౌన్‌ కలర్‌ పొట్టు వల్లనే బ్రౌన్‌ రైస్‌కు అనేక పోషక గుణాలు కలిగాయి. సాధారణ పాలిష్డ్‌ రైసుతో పోల్చితే బ్రౌన్‌ రైస్‌ ఎంతో మేలనే విషయం మనందరికీ తెలిసిందే. బియ్యపు పొట్టుకి ఉన్న ఔషధ గుణాలన్ని కలిసిన ఫ్రీడమ్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ని మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

మ్యాజిక్‌ చేసే ఒరిజనోల్‌
గోధుమ రంగులో ఉండే బియ్యపు పొట్టు, ఒరిజనోల్‌ అనే సూక్ష్మమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఒరిజనోల్‌ అవసరమని ఇప్పటికే వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్‌వో) సూచించింది. ఫ్రీడమ్‌ రిఫైన్డ్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో 10,000 ప్లస్‌ పీపీఎం ఆఫ్‌ ఓరిజనోల్‌ ఉంటుంది. ఇది సహాజమైన యాంటాక్సిడెంట్‌గా పని చేస్తూ శరీరంలోని కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది.

విటమిన్ల సమాహారం
రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో మోనో ఆన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ (ముఫా), ఒమెగా-6 పాలి అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ (పుఫా)లు ఉన్నాయి.  వీటి వల్ల శరీరంలో ఫ్యాట్‌ ప్రొఫైల్‌, టోకోఫెరోల్స్‌, టోకోట్రైనోల్స్‌ వంటి యాంటియాక్సిడెంట్లన్లు బ్యాలెన్స్‌ చేస్తోంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో తోడ్పడుతాయి. అంతేకాదు రైస్‌బ్రాన్‌ ఆయిల్‌లో విటమిన్‌ ఏ, డీలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవసరమైన అన్ని సుగుణాలతో ఫ్రీడమ్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది, 

డీప్‌ ఫ్రైకి అనుకూలం
భారతీయ వంటలకు అనువుగా దాదాపు 232 సెల్సియస్‌ డిగ్రీల దగ్గర కూడా రైస్‌బ్రాన్‌ అయిల్‌ వంటకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర డీప్‌ ఫ్రై సాధ్యమవుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు వేపుళ్లు తింటూ జిహ్యా చాపల్యాన్ని సంతృప్తి పరుస్తూనే ఆరోగ్యాన్ని కాపడుకునేందుకు రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ అనువుగా ఉంటుంది. అంతేకాదు వండినప్పుడు ఆహార పదార్థాలు రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ను తక్కువగా శోచించుకుంటాయి. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌కి ఉన్న మరో మంచి లక్షణం ఇది.

కాస్మోటిక్స్‌ తయారీలో
రైస్‌బ్రాన్‌ ఆయిల్‌కి ఇన్ని సుగుణాలు ఉండటం వల్లే సౌందర్య ఉత్పత్తుల తయారీలో రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ని విరివిగా ఉపయోగిస్తుంటారు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే సన్‌స్క్రీన్‌ లోషన్‌, డే క్రీముల్లో రైస్‌బ్రాన్‌ నుంచి తీసిన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. 

ఆరోగ్యమే మహాభాగ్యం
రైస్‌బ్రాన్‌ ఆయిల్‌తో ఎన్నో ఉపయోగాలు ఉండటంతో ఎంతో మంది భారతీయులు ఇతర కుకింగ్‌ ఆయిల్స్‌కి బదులుగా రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పినట్టు రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటే ఆస్పత్రుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది, వైద్య ఖర్చులు తప్పుతాయి. అన్నింటికీ మించి రోగాల బారిన పడకుండా ఉంటాం.(అడ్వర్టోరియల్‌)

Read latest Advt News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు