LPU: రూ. 3 కోట్ల ప్యాకేజీతో జర్మనీకి చెక్కేశాడు!

11 May, 2023 18:29 IST|Sakshi

లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)కి చెందిన పూర్వ విద్యార్థి యాసిర్‌ మహమ్మద్‌ ఓ జర్మనీ కంపెనీలో రూ.3కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శబాష్ అనిపించుకుంటున్నారు. 2018లో వర్సిటీ నుంచి పాసవుట్‌ అయిన యాసిర్‌ ప్లేస్‌మెంట్స్‌లో సరికొత్త చరిత్రను లిఖించాడు.

ఎల్‌పీయూ విద్యార్థులు ప్లేస్‌మెంట్లలో ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఆ వర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థి యాసిర్‌ మహమ్మద్‌ ఒక జర్మనీ కంపెనీలో రూ.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి శబాష్ అనిపించుకున్నాడు. 2018లో వర్సిటీ నుంచి పాసవుట్‌ అయిన యాసిర్‌ ప్లేస్‌మెంట్స్‌లో సరికొత్త చరిత్రను లిఖించాడు. ఇండస్ట్రీలో సరికొత్త సాంకేతిక నైపుణ్యాలైన కృత్రిమ మేధస్సు(AI), మెషిన్‌ లెర్నింగ్‌ (ML) ప్రాజెక్టులలో ఆయన పనిచేయనున్నారు. ఎల్‌పీయూలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక యాసిర్‌ మరే ఇతర డిగ్రీని అభ్యసించలేదు. ఆ వర్సిటీలో చదువుతున్న సమయంలోనే అక్కడ అందించిన నాణ్యమైన విద్యతో పాటు శిక్షణలో నేర్చుకున్న బలమైన ప్రాథమిక అంశాలు తన అపూర్వ విజయానికి కారణమని చెప్పుకొచ్చాడు.

ఎల్‌పీయూలో విద్యనభ్యసించి భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించిన వారిలో యాసిన్‌ ఒక్కరు మాత్రమే కాదు.. దిగ్గజ ఐటీ కంపెనీలైన గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, మెర్సిడెస్‌ తదితర ప్రపంచవ్యాప్తంగా ఇతర ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో రూ.కోటి అంతకన్నా అధిక ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపికైన వారిలో వేలాది మంది ఈ వర్సిటీకి చెందిన విద్యార్థులే ఉన్నారు. ఎల్‌పీయూ ప్రారంభం నుంచి ప్లేస్‌మెంట్స్‌లో మేటిగా నిలుస్తూ తనదైన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2000+కు పైగా దిగ్గజ కంపెనీలు ఐఐటీలు/ఐఐఎంలు/ఎన్‌ఐటీలతో పాటు ఎల్‌పీయూ నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి.

తన ప్రయాణంలో ఎల్‌పీయూ అధ్యాపకులు అందించిన మార్గదర్శకత్వం, మద్దతుకు యాసిర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్లేస్‌మెంట్‌ సెల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

రూ.3కోట్ల వార్షిక వేతన ప్యాకేజీకి ఎంపిక కావడంలో వర్సిటీలో అందించిన శిక్షణ, ప్రాక్టికల్‌ ట్రైనింగే ఎంతో కీలకంగా పనిచేసిందని చెప్పాడు. అలాగే, ఎల్‌పీయూలో నిర్వహించిన బోధనేతర కార్యకలాపాలు, ఈవెంట్లు తనలో వ్యక్తిత్వ వికాసంతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు ఎంతగానో దోహదం చేశాయని తెలిపాడు.

LPU B.Tech. CSE Passout Yasir M. | A Record-Breaking Package of ₹ 3 Crore At a Global MNC in Germany

ప్లేస్‌మెంట్లలో ఇలాంటి రికార్డులు ఎల్‌పీయూకు కొత్త ఏమీ కాదు. గతంలోనూ భారీ సంఖ్యలో ఇక్కడి ఉద్యోగులు ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2022లో ఎల్‌పీయూలో బీటెక్‌ గ్రాడ్యుయేట్‌ హరేకృష్ణ మహ్తో బెంగళూరులోని గూగుల్‌ కంపెనీలో రూ.64లక్షల భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. గత కొన్ని బ్యాచ్‌లు నుంచి చూస్తే 600 మందికి పైగా LPU విద్యార్థులు రూ.10 లక్షల నుంచి రూ.63లక్షల ప్యాకేజీలుతో ఉద్యోగాలు సాధించారు.

కాగ్నిజెంట్‌ 1850మందికి పైగా ఎల్‌పీయూ విద్యార్థులను నియమించుకోగా, క్యాప్జెమిని1400+, విప్రో 500+, ఎంఫసిస్530+, హైరేడియస్ 800+ ఇలా పలు ప్రతిష్ఠాత్మక కంపెనీలు సైతం ఎల్‌పీయూ విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. గత కొద్ది సంవత్సరాల్లో 20వేలు కన్నా ఎక్కువ ప్లేస్‌మెంట్స్‌/ఇంటర్న్‌షిప్‌ల్లో ఎల్‌పీయూ విద్యార్థులే టాప్‌లో ఉన్నారు. కొన్ని ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు 5వేలకు పైగా ఆఫర్లు ఇచ్చాయి. ఎల్‌పీయూ గురించి హరేకృష్ణ ఏమంటున్నారో మీరే వినండి.  

LPU B.Tech. CSE Graduate Harekrishna Mahto | Hired By Google At 64 LPA | #UnBeatablePlacementsAtLPU

ఎల్‌పీయూ పరీక్ష, అడ్మిషన్ల ప్రక్రియ గురించి తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి https://bit.ly/3psMUAO

ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్టుగా పాఠ్యప్రణాళిక రూపొందించి.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి వారికి అద్భుతమైన అవకాశాలు కల్పించడంలో ఎల్‌పీయూ దానికదే సాటి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, CompTIA, ట్రాన్సోర్గ్‌ అనలిటిక్స్‌, ఐబీఎం వంటి అనేక దిగ్గజ కంపెనీల అధినేతలతో కలిసి విద్యార్థులకు వాస్తవిక ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం కల్పిస్తోంది. అలాగే, 300+ కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలతో టై-అప్‌ కలిగి ఉండటం ద్వారా విదేశాల్లో చదవాలనుకొనే వారికి ఎల్‌పీయూ అవకాశాలు కల్పిస్తుంది.

ఎల్‌పీయూ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు త్వరలోనే ముగియనుంది. ఇక్కడ అడ్మిషన్లకు చాలా పోటీ ఉంటుంది. LPUNEST 2023ప్రవేశ పరీక్షలో ప్రతిభతో పాటు కొన్ని ప్రోగ్రామ్‌లలో వ్యక్తిగత ఇంటర్వ్యూలను క్లియర్‌ చేయడంపై అడ్మిషన్లు ఆధారపడి ఉంటాయి. పరీక్ష, అడ్మిషన్ల ప్రక్రియ తెలుసుకొనేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి. https://bit.ly/3psMUAO

మరిన్ని వార్తలు