చిన్నారి శ్రీయాన్‌కి ఎంత కష్టమో !

3 Sep, 2021 12:05 IST|Sakshi

మా ఆయన పేరు రాజు. వ్యవసాయం చేసే వాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలో బాగానే బతికే చింత లేని చిన్న కుటుంబం మాది. మా సంతోషాన్ని రెట్టింపు చేయడానికా అన్నట్టుగా వచ్చాడు శ్రీయాన్‌. 

ముద్దులొలికే శ్రీయాన్‌
మా ముద్దుల కొడుకు శ్రీయాన్‌. వాడి బోసినవ్వులతో మా ఇంట ఆనందాలు వెల్లివిరిసేవి. శ్రీయాన్‌ ఆలనాపాలన చూడటంతోనే నాకు రోజు గడిచిపోయేది. అయితే ఉన్నట్టుండి శ్రీయాన్‌ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం గమనించాను. శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడే వాడు. నెలల పసిబిడ్డకు ఎందుకిలా జరుగుతుందా అనుకునే లోపే ఒక్కసారిగా బిడ్డ నీరసించిపోవడం మొదలైంది. నా గుండెలో దడ మొదలైంది. నేను నా భర్త రాజు బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం.

గుండె పగిలింది
ఆ యేడు వ్యవసాయంలో వచ్చిన సొమ్ములతో హైదరాబాద్‌ చేరుకున్నాం. పెద్ద డాక్టర్లను కలిశాం. మా బిడ్డకు అంతా మంచి జరుగుతుందనే అనుకున్నాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ఏడాది కూడా నిండని నా బిడ్డకు లార్జ్‌ మస్కులర్‌ వెంట్రిక్యూలర్‌ సెప్టికల్‌ డిఫెక్ట్‌ అని చెప్పారు. అర్థం కాలేదు సార్‌ అడిగితే నీ బిడ్డ గుండెకు రంధ్రం ఉందంటూ చెప్పారు. ఓపెన్‌ హర్ట్‌ ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆ ఆపరేషన్‌కి రూ,.6,00,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఆపరేషన్‌ చేయకుంటే బతుకు గండమే అన్నారు. మొదటి పుట్టిన రోజు జరుపుకోవడం కూడా కష్టమే అన్నారు.

సాయం చేయండి
ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకుంటే గడిచే ఇళ్లు మాది. శ్రీయానే ఇప్పుడు మా ప్రపంచం కానీ. వాడి ఆరోగ్యం బాగాలేదు. వాడు లేకపోతే మాకు బతుకు లేదు. కానీ వాడి ఆపరేషన్‌కి అవసరమైన డబ్బులు మా దగ్గర లేదు. అప్పుడే మెడికల్‌ ఫండ్‌ రైజింగ్‌ సంస్థ కెట్టోను సంప్రదించాం. మా బిడ్డ ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు సమకూరాలని ఆ దేవుళ్లని మొక్కుకుంటున్నాను. మీరు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్‌ చేయండి 

మరిన్ని వార్తలు