ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. నీలం రంగులోకి చిన్నారి శరీరం

31 May, 2021 09:47 IST|Sakshi

అభిమన్యు బోసినవ్వులతో వెలిగిపోతున్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చిన్నారి రాకతో ఆ ఇంట ఆనందం వెల్లివెరిసింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఓ రోజు అతని శరీరం క్రమంగా నీలం రంగులోకి మారిపోతుండటంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే వైద్యులను సంప్రదించగా వారు చెప్పిన నిజం తెలిసి గుండె పగిలేలా రోదిస్తున్నారు. తీవ్రమైన టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్,  పల్మనరీ స్టెనోసిస్‌ అనే వ్యాధితో చిన్నారి బాధపడుతున్నాడని వైద్యులు నిర్థారించారు. చిన్నారి పుట్టినప్పటి నుంచే  గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడని, వెంటనే ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు తెలిపారు. అయితే ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్‌ మోస్ట్‌  క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ ) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి  ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. 


సంవత్సరం క్రితమే అభిమన్యు మా జీవితాల్లోకి వచ్చాడు. అతని రాకతోనే ఎన్నో వెలుగులు తెచ్చాడు. ఆ బోసినవ్వులతో ఎంతో చక్కగా సాగిపోతున్న మా జీవితాల్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు కాబోతున్నాం అని ఎంత సంతోషించామో ఇప్పటికీ గుర్తు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు కొనసాగలేదు. నా బిడ్డ కొన్ని రోజుల నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణంగా అందరు పిల్లల్లో ఉండేదే అనుకున్నాం. కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం, క్రమంగా శరీరం నీలం రంగులోకి మారుతుండటంతో చాలా భయపడుతూనే హాస్పిటల్‌కి వెళ్లాం.

అప్పుడు రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు నా చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పారు. వెంటనే బాబుకు చికిత్స చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. ఈ ట్రీట్‌మెంట్‌ మొత్తానికి దాదాపు 10లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు  చెప్పారు. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక కుటుంబ పోషణే జటిలమైపోయింది. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. అభిమన్యుకు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి మా బిడ్డను కాపాడండి. నా అభిమన్యుకు ప్రాణ భిక్ష పెట్టండి. 


కెటో
ఇండియాస్‌ మోస్ట్‌ క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్‌తో కొలాబరేట్‌ అయ్యి డబ్బులు లేని వారెందరికో  సోషల్‌ మీడియా ద్వారా ఫండింగ్‌ చేసి చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్)

 

మరిన్ని వార్తలు