ఈ దీపికను ఆదుకోరూ..

19 Nov, 2021 17:22 IST|Sakshi

నా మనవరాలి పేరు దీపిక. పేరుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచి తన చుట్టూ ఉన్న చీకటిని దగ్గరికి రానిచ్చేది కాదు. నెలల పాపగా ఉన్నప్పుడే అనారోగ్యంతో తల్లిని కోల్పోయింది. అప్పటి నుంచి నేను అమ్మమ్మగా కాకుండా ఓ తల్లిలా దీపికను పెంచుతూ వస్తున్నాను. ఎప్పుడైనా మా అమ్మ ఎలా ఉండేదని తను అడిగితే దుఃఖం కట్టలు తెంచుకునేది. నా బాధ చూడలేక అమ్మలేకపోతే నువ్వున్నాకు కదా అమ్మమ్మ అంటూ నన్ను ఓదార్చేది.

దురదృష్టం మరోసారి దీపికను వెక్కిరించింది. నిండా పదేళ్లు కూడా నిండకముందే క్యాన్సర్‌ వ్యాధితో దీపిక తండ్రి కూడా కాలం చేశాడు. అప్పటి నుంచి తల్లిదండ్రి అన్నీ నేను అయి ఆమెను సాకుతున్నాను. వయసు మీద పడుతున్నా దీపిక భవిష్యత్తు కోసమే కాయకష్టం చేసి పెంచుకుంటున్నాను. కానీ ఇంతలోనే మరో కష్టం వచ్చి మా మీద పడింది.

ఉన్నట్టుండి దీపికకు ఒంట్లో బాగుండటం తేదని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సివియర్‌ నిమోనియా హైపోటానిక్‌ క్వాడ్రిపెరాసిస్‌ పెరాసిస్‌ వచ్చిదంటూ చెప్పారు. నెమ్మదిగా కండరాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుందని డాక్టర్లు వివరించారు. ఆ సమస్య రాకుండా ఉండేందుకు వ్యాధి తగ్గేందుకు మందుకు రాసిచ్చారు.  మందులు వాడినా రోగం తగ్గలేదు.. మరింతగా పెరిగింది. దీపిక నడవలేని, ఏమీ తినలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. మంచానికే పరిమితమైంది.

వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చాను. కొన్ని రోజులుగా ఇక్కడే చికిత్స అందిస్తున్నాను. కానీ ఈ రోగం నయం కావాలంటే నెలల తరబడి వైద్యం చేయాలని డాక్టర్లు చెప్పారు. వైద్య చికిత్సకు రూ.6,00,000 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు.

నా భర్త ఎప్పుడో చనిపోయాడు. ఒక్కగానొక్క కూతురు కూడా చాన్నాళ్ల క్రితమే చనిపోయింది. కూలి పని చేసుకుంటూ నా మనవరాలిని చదివిస్తూ ఆమె భవిష్యత్తే లోకంగా బతుకున్నాను. కానీ ఇంతలో నా మనవరాలికే పెద్ద కష్టం వచ్చింది. ఆమె వైద్యానికి అయ్యే ఆరు లక్షల రూపాయాలను నేను ఎక్కడి నుంచి తేగలను. అప్పుడే ఆస్పత్రిలో మెడికల్‌ ఎమర్జెన్సీలో ఆదుకునే కెట్టో గురించి తెలిసింది. నా మనవరాలు దీపిక ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి.   

సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు